పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం

ABN , First Publish Date - 2020-06-30T11:11:51+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకూ పెంచుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులపై భారం పడుతోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ ఆందోళన


జగిత్యాల టౌన్‌, జూన్‌ 29 : కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకూ పెంచుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులపై భారం పడుతోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అ డ్లూరి లక్ష్మన్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నివాసం నుం చితహసీల్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం సమీపంలో ప్రధాన రహరారిపై గంట సేపు భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తమ డిమాండ్లతో కూడిన వినతి ప త్రాన్ని ఆర్డీవో మాధురికి అందించారు.


అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ దేశమంతా నా లుగు నెలలుగా కరోనాతో బాధపడుతూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజలపై రోజు రోజుకూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను మరింత కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తికి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లే కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఎందుకు అమలు చే యడం లేదని ప్రశ్నించారు. తక్షణమే పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.   కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, నాయకులు విజయ లక్ష్మి, మోహన్‌, దుర్గ య్య, రాజేందర్‌, రమేష్‌, మన్సూర్‌, నిషాంత్‌ రెడ్డి, స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-30T11:11:51+05:30 IST