సత్యదేవుడి హుండీల ఆదాయం రూ 1.81 కోట్లు
ABN , First Publish Date - 2022-06-18T07:10:57+05:30 IST
రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించగా రూ.1,81,71, 567 నగదు, 118 గ్రాముల బంగారం, 890 గ్రా ముల వెండి సమకూరాయి.
అన్నవరం, జూన్ 17: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించగా రూ.1,81,71, 567 నగదు, 118 గ్రాముల బంగారం, 890 గ్రా ముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యుఎ్‌సఏ 103 డాలర్లు, యుఏఈ 30 దిరహ మ్స్, కెనడా 35 డాలర్లు, సింగపూర్ 2, సౌదీ అరేబియా 5, సెంట్రల్ బ్యాంక్ కతర్ 10 రియల్స్ లభించాయి. 28 రోజులకుగాను ఈ ఆదాయం హుండీల ద్వారా సమకూరినట్టు ఈవో త్రినాథరావు తెలిపారు. లెక్కింపును ఈవో తోపాటుగా చైర్మన్ రోహిత్, సహాయ కమిషనర్ రమే్‌షబాబు పర్యవేక్షించగా సిబ్బంది లెక్కించారు.