చెత్త నుంచి ఆదాయం

ABN , First Publish Date - 2022-05-19T06:41:46+05:30 IST

పర్యావరణ పరి రక్షణకు సూర్యాపేట మునిసిపాలిటీ వినూత్న రీతి లో చర్యలు చేపడుతోంది. హానికర వస్తువుల నుం చి ఆదాయం దిశగా అడుగులు వేస్తోంది.

చెత్త నుంచి ఆదాయం
తయారు చేసిన ఇటుకలను పరిశీలిస్తున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ

పర్యావరణహితమే పేట మునిసిపాలిటీ లక్ష్యం 

రాష్ట్రంలోని మునిసిపాలిటీలకు ఆదర్శం


సూర్యాపేటటౌన్‌, మే 18: పర్యావరణ పరి రక్షణకు సూర్యాపేట మునిసిపాలిటీ వినూత్న రీతి లో చర్యలు చేపడుతోంది. హానికర వస్తువుల నుం చి ఆదాయం దిశగా అడుగులు వేస్తోంది. ప్లాస్టిక్‌ కవర్ల నుంచి వస్తువులను తయారుచేస్తూ అందరి అభినందనలు పొందుతోంది. ప్లాస్టిక్‌ కవర్ల ముడిపదార్థం నుంచి అక్యూప్రెషర్‌ మ్యాట్‌తోపాటు టైల్స్‌, ఇటుకలను తయారు చేస్తున్న మునిసిపాలిటీగా జా తీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల మేయర్లతో నిర్వహించిన సమావేశంలో సైతం ప్లాస్టిక్‌ కవర్ల నుంచి తయారు చేస్తున్న వసు వులపై సభికుల నుంచి మునిసిపల్‌ అధికారులు అభినందనలు పొందారు. కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌ సైతం అభి నందించడంతో పాటు జాతీయస్థాయిలో సూర్యాపేటకు గుర్తింపు లభిస్తుందని కొనియాడారు. 


ప్రతీరోజు 69 టన్నుల చెత్త సేకరణ 

సూర్యాపేట మునిసిపాలిటీ ఆదాయమే లక్ష్యంగా చర్యలు చేపడుతూ ప్రశంసలు పొందుతోంది. ఈ మునిసిపాలిటీ ప్రతీరోజు 69 టన్నుల చెత్త సేకరి స్తుంది. ఇందులో ప్లాస్టిక్‌ కవర్లు 300 కిలోలు ఉండ గా, ఈ 300 కిలోల నుంచి 270 కిలోల ముడి సరు కు వస్తుంది. ఈ ప్లాస్టిక్‌ కవర్ల నుంచి తయారు చేసిన ముడి సరుకులను కిలో రూ.28 చొప్పున బయట వ్యాపారులకు గతంలో విక్రయించేవారు. అయితే ప్రస్తుతం కొత్తగా మునిసిపాలిటీ ఈ ముడి సరుకునుంచి ఆక్యూప్రెషర్‌ మ్యాట్‌, ఇటుకలు, టైల్స్‌లను తయారుచేస్తోంది. ఒక కిలో ముడి సరుకుతో ఒక ఇటుక గానీ అక్యూప్రేషన్‌ మ్యాట్‌గాని తయారవుతుంది. ఈ మ్యాట్‌ను, ఇటుకలను సూర్యాపేట మునిసిపల్‌ కార్యాలయంలో విక్రయానికి సిద్ధం చేశారు. ఒక్క అక్యూప్రేషప్‌ మ్యాట్‌ రూ.150, ఇటుక రూ.35, టైల్‌ రూ.40లకు విక్రయిస్తున్నారు. 


అనేక మార్గాల్లో ఆదాయం 

సూర్యాపేట మునిసిపాలిటీకి ఒక్క సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల నుంచే కాకుండా అనేక మార్గాల్లో ఆదాయం సమకూరుతోంది. ఇటీవల హైదరాబా ద్‌ కంపెనీకి సూర్యాపేట మునిసిపాలిటీ నుంచి సేకరించిన తడిచెత్తను అందించేందుకు అంగీకార నిర్ణయం తీసుకున్నారు. ఈ తడి చెత్త నుంచి బయోగ్యా్‌సను తయారు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్లాంట్‌ను సైతం ఏర్పాటు చేయడానికి ఇమామ్‌పేటలోని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఇవేకాకుండా పూలు, ఆకులతో ఎరువులు తయారుచేస్తున్నారు. కరెంట్‌ స్థంభాలకు అడ్డంగా ఉన్నచెట్ల కొమ్మలను తొలగించగా, ఆ కొమ్మల ఆకులను సేంద్రీయ ఎరువులుగా తయారుచేస్తున్నారు. బతుకమ్మ పండుగల సందర్భంగా చెరువుల్లో వేసే బతుక మ్మ పూలను సేకరించి వాటిని సైతం ఎరువులు గా తయారు చేస్తున్నారు. పట్టణంలోని ఇళ్లలో సేకరించిన తడి చెత్తను కూడా సేంద్రీయ  ఎరువుల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ ఎరువులను 25 కిలోల బస్తాను రూ.8నుంచి రూ.12కు రైతులకు, లేదంటే అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. పొడిచెత్త నుంచి ముడి సరుకుగా మలిచి చిన్నచిన్న రేకులను తయారుచేసి చిరువ్యాపారులకు అందజేస్తున్నారు. 


వ్యర్థాలనుంచి వస్తువుల తయారీ అభినందనీయం

పులివెందుల మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ మనోహర్‌రెడ్డి 

సూర్యాపేటరూరల్‌: ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి వస్తువుల తయారీ అభినందనీయమని కడప జిల్లా పులివెందుల మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గ్రామ, జమునానగర్‌లోని డంపింగ్‌ యార్డును పరిశీలించి ఆయన మాట్లాడారు. రీసైక్లింగ్‌ చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలోనూ ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఇక్కడికి పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. ఆయనవెంట సూర్యాపేట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ ్ల అన్నపూర్ణ, మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సారగండ్ల శ్రీనివాస్‌, ఇంజనీర్‌ శివప్రసాద్‌, కౌన్సిలర్‌ ఆకుల కవిత, సిబ్బంది పాల్గొన్నారు.


పర్యావరణ పరిరక్షణే లక్ష్యం : రామాంజులరెడ్డి,మునిసిపల్‌ కమిషనర్‌,సూర్యాపేట 

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సేవలందిస్తున్నాం. ప్లాస్టిక్‌ కవర్ల నుంచి తయారు చేసిన అక్యూప్రెషర్‌ మ్యాట్‌లను సూర్యాపేట మునిసిపల్‌ కార్యాలయంలోనే రూ.150 విక్రయిస్తున్నాం. ఆదాయమే లక్ష్యంగా పేట ము నిసిపాలిటీని తీర్చిదిద్దుతున్నాం. తడి, పొడి చెత్తలనుంచి వివిధ వస్తువులు తయారు చేస్తున్నాం.  


Updated Date - 2022-05-19T06:41:46+05:30 IST