మోడల్‌ స్కూళ్లకు ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లు

ABN , First Publish Date - 2022-05-23T06:03:25+05:30 IST

ఏపీ మోడల్‌ స్కూళ్లకు ఎట్టకేలకు ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లను నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

మోడల్‌ స్కూళ్లకు ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లు

ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ అధికారి 

 

ఆలూరు, మే 22 : ఏపీ మోడల్‌ స్కూళ్లకు ఎట్టకేలకు ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లను నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో 16 ఏపీ మోడల్‌ స్కూళ్లు ఉండగా... 10 స్కూళ్లకు రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగిలిన ఆరు స్కూళ్లకు  సీనియార్టీ ప్రతిపాదికన పీజీటీ అర్హత ఉన్న ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాళ్లను నియమించారు. మద్దికెర మోడల్‌ స్కూలుకు సవిత కరణం, మంత్రాలయం మండలం రచ్చుమర్రికి ప్రసాద్‌, ఆలూరుకు బాలకృష్ణ, ఆస్పరి మండలం పుట్టకలమర్రికి ఫణీంద్ర, పెద్దకడుబూరుకు రంగన్న, పత్తికొండ స్కూలుకు రేష్మా కౌసర్‌ను నియమించారు. ఈ నెల 23న వీరు ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లుగా పూర్తి బాధ్యతలు తీసుకొని విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-23T06:03:25+05:30 IST