ఆగని వలసలు

ABN , First Publish Date - 2020-06-07T10:34:25+05:30 IST

ఉమ్మడి జిల్లా పరిధిలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో పాటు ...

ఆగని వలసలు

ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వలసలు

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో భారీగా చేరుతున్న జట్పీటీసీలు, ఎంపీటీసీలు 

మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో జోరుగా చేరికలు


నిజామాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా పరిధిలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గపరిధిలో ప్రధాన ప్రతిపక్షాలు లేకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఉమ్మ డి జిల్లా పరిధిలో 80శాతం వరకు అధికార పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, కౌన్సిలర్లు, కార్పొరేటర్లే ఉన్నా బలం పార్టీకి మరింత పెరిగేందుకు ఎమ్మెల్యేలు వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఉప ఎన్నికతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గాలు, మండలాల పరిధిలో బలమైన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు లేకుండా చూసుకుంటున్నారు. గడిచిన నెల రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన నలుగు రు జడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఏర్గట్ల, భిక్కనూ రు, దోమకొండ, పిట్లం మండలాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ జడ్పీటీసీలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల స మక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు నందిపేట జడ్పీటీసీ కూడా ఆర్మూర్‌ ఎమ్మెల్యే సమక్షంలో ఇరవై రో జుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీటీసీలు, కౌన్సిల ర్లు, కార్పొరేటర్ల వలసలు కూడా ఆగడం లేదు. ప్రతిరో జు ఏదో  ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ లేదా బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల సమక్షంలో పా ర్టీలో చేరుతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో కాంగ్రెస్‌కు చెందిన జడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీలు సుమారు ఇరవై మంది వరకు టీఆర్‌ఎస్‌లో చేరా రు. వీరితో పాటు బీజేపీ జడ్పీటీసీ, కార్పొరేటర్లు ఐదుగు రి వరకు టీఆర్‌ఎస్‌లో చేరారు. 


భవిష్యత్తులో పదవులపై ఆశతోనే..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో పాటు భవిష్యత్తులో తమకు కలిసి వస్తుందని ఎమ్మెల్యేల సమక్షంలో వీరు ముందు గా చేరుతున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులైన వీరు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ నుంచి గెలిచినా టీఆర్‌ఎస్‌లో ఉంటే అభివృద్ధి చేసేందుకు నిధులువస్తాయని భావిస్తూ పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా అ వకాశం కల్పిస్తామని హామీలు ఇస్తుండడంతో ముందు కు వస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే మరో నాలుగేళ్ల వరకు నిధులు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నామని నాలుగు రోజుల క్రితం టీ ఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ జడ్పీటీసీలు తెలిపారు. ప్రజ లు తమను నమ్మకంతో గెలిపించారని, కనీస పనులు చేయకపోతే పట్టించుకునే పరిస్థితులు ఉండవని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప రిధిలో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌, బీజేపీకి తక్కువమంది సభ్యులు ఉన్నా ఐదేళ్లపాటు పార్టీకి వెన్నుగా నిలుస్తార ని సీనియర్‌ నేతలు భావించారు. ప్రస్తుతం వలసలకు సిద్ధమవుతుండడంతో ఉన్నవారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


పార్టీ నేతల భిన్నాభిప్రాయాలు..

జిల్లాలో వలసలపై పార్టీల నాయకులు భిన్నాభిప్రా యాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం తాము ఎవరినీ టీఆర్‌ఎస్‌లోకి రావాలని కోరడం లేదన్నారు. వారే స్వచ్ఛందంగా వస్తుంటే చేర్చుకుంటున్నామని తెలిపారు. ఉప ఎన్నిక సమయంలో వలసలను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిని నివారించడంతో పాటు ఉప ఎన్నిక సమ యంలో చేరిన వారి ఓటు హక్కును రద్దుచేయాలని వా రు కోరుతున్నారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా రెండు దఫాలు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రం ఈ వలసలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. మరికొంత మంది కూడా వచ్చే కొన్ని రోజుల్లో చేరేందు కు సిద్ధమవుతున్నట్లు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తెలిపారు.

Updated Date - 2020-06-07T10:34:25+05:30 IST