Abn logo
Jul 31 2021 @ 00:32AM

వ్యాపారులకు ప్రోత్సాహకాలు

వ్యాపారులతో సమావేశమైన కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు

సీడబ్ల్యుసీ డైరెక్టర్‌ అమిత్‌కుమార్‌ సింగ్‌

విశాఖపట్నం, జూలై 30( ఆంధ్రజ్యోతి): కేంద్ర గిడ్డంగుల సంస్థ పరిఽధిలో కంటెయిన్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ ద్వారా వ్యాపారం చేసే వ్యాపారులు, భాగస్వామ్యులకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించినట్టు సంస్థ జాతీయ డైరెక్టర్‌ అమిత్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. నగరంలో రాయల్‌ఫోర్టు హోటల్‌లో శుక్రవారం భాగస్వామ్యులు, నిల్వదారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.  కంటెయిన్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ 2001 నుంచి   విశాఖ పోర్టు ద్వారా ఎగుమతులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న టారిఫ్‌లను త్వరలో సవరిస్తామని వెల్లడించారు. సమావేశంలో హైదరాబాద్‌ ప్రాంతీయ మేనేజర్‌ అజయ్‌ జడూ, విశాఖ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.