Abn logo
Jan 20 2021 @ 21:31PM

అసంపూర్తి నిర్మాణాలను పూర్తిచేయాలి

గూడూరు(రూరల్‌), జనవరి 20: అసంపూర్తిగా ఉన్న రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలను త్వరిగతిన పూర్తిచేయాలని డీఎల్‌డీవో సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో డీఈలు, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలలో నాణ్యత లోపించకుండా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు కాంతారావు, కృష్ణబాబు, రవీంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement