నూతన విద్యావిధానంలో ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-08-11T06:33:16+05:30 IST

నూతన విద్యావిధానంలో ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, దీనిని ఔత్సాహికులు, ఎంటర్‌ప్రెన్యుయర్స్‌, స్టార్టప్‌ సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) చీఫ్‌ కో ఆర్డినింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బుద్దా చంద్రశేఖర్‌ సూచించారు

నూతన విద్యావిధానంలో ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న డాక్టర్‌ బుద్దా చంద్రశేఖర్‌

ఐఐసీ రీజినల్‌ మీట్‌లో ఏఐసీటీఈ చీఫ్‌ కోఆర్డినింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బుద్దా చంద్రశేఖర్‌

ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 10: నూతన విద్యావిధానంలో ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, దీనిని ఔత్సాహికులు, ఎంటర్‌ప్రెన్యుయర్స్‌, స్టార్టప్‌ సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) చీఫ్‌ కో ఆర్డినింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బుద్దా చంద్రశేఖర్‌ సూచించారు. ఇనిస్టిట్యూషన్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌(ఐఐసీ) రీజినల్‌ మీట్‌ బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో జరిగింది. 


వీసీ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మీట్‌ను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఉన్నత విద్యా సంస్థలు అందుకు అవసరమైన ప్రొగ్రాంలను తయారుచేయాలని ఆయన సూచించారు. అస్టిస్టెంట్‌ ఇన్నోవేషన్‌ డైరెక్టర్‌ దీపక్‌సాహు మాట్లాడుతూ వర్సిటీల ప్రోత్సాహంతో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. వీసీ ప్రసాద్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ  ఏయూలో ఇన్నోవేషన్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యార్థుల స్పందన కూడా బాగుందని చెప్పారు.


ప్రస్తుతం ఏయూలో 600 మందికి పైగా విదేశీ విద్యార్థులు చదువుతున్నారని, వీరి సంఖ్యను వెయ్యి వరకు పెంచడం లక్ష్యమన్నారు. రు. ఐఐసీ ఏయూ అధ్యక్షులు ప్రొఫెసర్‌ హెచ్‌ పురుషోత్తం, ఉపాధ్యక్షుడు రవి ఈశ్వరపు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి 160 సంస్థలకు చెందిన 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహికులు 75 స్టార్టప్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-11T06:33:16+05:30 IST