ఢిల్లీ ర్యాలీకి మద్దతుగా..

ABN , First Publish Date - 2021-01-27T05:03:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ర్యాలీకి మద్దతుగా, ఉమ్మడి జిల్లాలో రైతులు, రైతు సంఘం నాయకులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో సీపీఎం, సీపీఐ, టీడీపీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీలు జరిగాయి.

ఢిల్లీ ర్యాలీకి మద్దతుగా..
నల్లగొండలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలు

నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ర్యాలీకి మద్దతుగా, ఉమ్మడి జిల్లాలో రైతులు, రైతు సంఘం నాయకులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో సీపీఎం, సీపీఐ, టీడీపీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీలు జరిగాయి. నల్లగొండలో వామపక్షాల ఆధ్వర్యంలో దేవరకొండ రోడ్డు నుంచి మునుగోడు రోడ్డు, గడియారం సెంటర్‌ వరకు ట్రాక్టర్‌ ర్యాలీ జరిగింది. మిర్యాలగూడ, హాలియాలో సైతం ట్రాక్టర్‌ ర్యాలీ జరగ్గా, మిర్యాలగూడలో సీపీఎం రాష్ట్ర నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. దేవరకొండ మండలంలోని పడమటపల్లి నుంచి దేవరకొండ పట్టణం వరకు ట్రాక్టర్‌ ర్యాలీ సాగింది. సూర్యాపేట జిల్లా కేంద్రం, హుజూర్‌నగర్‌, కోదాడలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన ర్యాలీలో  రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కందాళ ప్రమీళ, పీఎన్‌ఎం జిల్లా అధ్యక్షుడు చల్లం పాండురంగరావు, శ్రీశైలం, నాగిరెడ్డి, అయిలయ్య, నాగార్జున పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:03:41+05:30 IST