Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతుల ధర్నా

అడ్లూరి, రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ధర్మపురి, డిసెంబరు 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలుపై అను సరిస్తున్న విధానాలకు నిరసనగా ధర్మపురి మండలంలోని రాయపట్నం జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రైతులు శనివారం  ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నియో జకవర్గ పరిధిలో గల వందలాది మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రహదారిపై సుమారు గంట సేపు బైఠాయించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వందలాది వాహనాలు నిలిచి పోయాయి. లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం విషయంలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తూకం వేసిన  ధాన్యాన్ని రైస్‌మిల్స్‌కు తీసుకు వెళితే క్వింటాళుకు 8 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోత విషయమై ప్రశ్నించే రైతుల నుంచి రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని తూ కం చేయడం లేదని ఆయన అన్నారు. అధికార పార్టీకి చెందిన జైనా పీసీసీఎస్‌ చైర్మన్‌ సౌళ్ల నరేష్‌, పాలకవర్గ సభ్యులు కలిసి రైతులు పడుతున్న భాధలను ప్రభు త్వం దృష్టికి తీసుక వెళ్లినట్లు ఆయన తెలిపారు. ధాన్యాన్ని ఇబ్బందులు లేకుండా రైస్‌మిల్లర్స్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతుకు మద్దత్తు ధర చెల్లించి నేరుగా అకౌంట్‌కు డబ్బులు ప్రభుత్వమే పంపించాలని ఆయన కోరారు. విషయం తెలుసుకున్న ధర్మపురి ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది రాయపట్నం చేరుకుని ధర్నా విరమింపజేశారు. అనంతరం అడ్లూరి సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులు, రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అడ్లూరి చొక్కా చిరిగి పోవటంతో కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే అడ్లూరి సహా కార్యకర్తలు, రైతులను ధర్మపురి పోలీస్‌స్టేషన్‌ తరలించారు. అనంతరం  నాయకులు, రైతులపై రోడ్డు దిగ్భందించి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు సంగన భట్ల దినేష్‌, సుభాష్‌, శైలేందర్‌రెడ్డి, నిశాంత్‌రెడ్డి, రాములు, శ్రీనివాస్‌, మండల ఉపా ధ్యక్షులు రాజేష్‌, శ్రీనివాస్‌, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు సంహరాజు ప్రసాద్‌, జైనా ఎంపీటీసీ రజిత-సుధాకర్‌, మైనార్టీ అధ్యక్షులు ఎండీ రఫియొద్దీన్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement