Imran khan : RSS పై సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-07-16T22:25:47+05:30 IST
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాము చర్చలకు సిద్ధంగానే
ఇస్లామాబాద్: ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, అయితే ఆరెస్సెస్ భావజాలమే అందుకు అవరోధంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో చర్చల విషయమై ఆయనను మీడియా ప్రశ్నించినపుడు ఆయన పై విధంగా స్పందించారు. ‘‘పొరుగు దేశమైన భారత్‌తో సఖ్యతగా ఉండడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ.. ఏం చేయాలి? మధ్యలో ఆరెస్సెస్ భావజాలం వచ్చి చేరింది’’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
తిప్పికొట్టిన కేంద్రమంత్రి కౌశల్
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ స్పందించారు. ఆరెస్సెస్ ఎప్పుడూ సామరస్యాన్నే బోధిస్తుందని పేర్కొన్నారు. తీవ్రవాద మూలాలు పాక్‌లోనే ఉన్నాయని, ఈ విషయం ప్రధాని ఇమ్రాన్‌కు బాగా తెలుసని చురకలంటించారు. సంఘ్‌ను విమర్శించి లాభం లేదని, అదో అర్థంపర్థంలేని వ్యాఖ్య అని కౌశల్ కిశోర్ మండిపడ్డారు.