నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు

ABN , First Publish Date - 2020-05-15T09:30:52+05:30 IST

గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి తెలిపారు. గురువారం మండల కేంద్రమైన

నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు

కొండాపురం, మే 14: గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి తెలిపారు. గురువారం మండల కేంద్రమైన కొండాపురంలో ఆమె పర్యటించి  కొండాపురం ఆర్‌అండ్‌ఆర్‌ పనులపై  అధికారులతో చర్చించి నిర్వాసితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభు త్వం ఈ యేడాది 20టీఎంసీల నీటిని గండికోటలో నిల్వ ఉంచేందుకు ప్ర ణాళిక సిద్ధం చేస్తోందని అందులో భాగంగా జూలై నెలాఖరుకల్లా కొండాపురం పునరావాసం పనులన్నీ పూర్తికావాలన్నారు. కొండాపురం నిర్వాసితులకు ఏర్పాటయ్యే రామచంద్రనగర్‌, శివసాయి హైస్కూల్‌, రాఘవేంద్రస్వామి కళ్యాణమండపం, ఎస్సీ కాలనీ పునరావాస కేంద్రాలను ఆమె పరిశీలించారు.


కొండాపురం నిర్వాసితులకు మరింత మందికి పునరావాసం కావాల్సి ఉన్నందున స్త్రీశక్తి భవనం వెనుక స్థలాన్ని పరిశీలించి వెంటనే చదును చేసి నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించాలని ఆదేశించారు. డ్రైనే జీ, రోడ్లు, కరెంటు వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను తోలుకునేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్వాసితులు కోరగా వెంటనే ఆ ఏర్పాట్లను పూర్తిచేయాలన్నారు. కొండాపురం డేంజర్‌ జోన్‌లో ఉన్నా ఇంకా పరిహారం అందలేదని, సప్లిమెంటరీ జాబితాలో తమ పేర్లు ఉన్నాయని నిర్వాసితులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు.


వారంలోపు సర్వే చేయించి అర్హులైన వారి పేర్లను సప్లిమెంటరీ జాబితాలో పొందుపరుస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న, విద్యుత్‌ ఎస్‌ఈ శ్రీనివాసులు, ఇరిగేషన్‌ ఈఈ రామాంజనేయులు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక నాయకులు నీలకంఠారెడ్డి, వాసుదేవరెడ్డి, విశ్వనాథరెడ్డి, ఖాదర్‌బాష, మనోహర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-15T09:30:52+05:30 IST