రౌడీషీటర్‌కు జైలుశిక్ష
ABN , First Publish Date - 2022-10-14T17:05:50+05:30 IST
మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులతో గొడవపడుతున్న రౌడీషీటర్‌కు న్యాయస్థానం 225 రోజుల జైలుశిక్ష విధించింది.
హైదరాబాద్ సిటీ: మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులతో గొడవపడుతున్న రౌడీషీటర్‌కు న్యాయస్థానం 225 రోజుల జైలుశిక్ష విధించింది. కార్ఖానాకు చెందిన నరేందర్ అలియాస్ తూఫాన్ (29)కు నేర చరిత్ర ఉంది. ఇతడిపై కార్ఖానా పోలీసుస్టేషన్లో రౌడీషీట్ నమోదైంది. గతంలో పోలీసులు పీడీ యాక్ట్ విధించి జైలుకు పంపారు. నరేందర్ మద్యం తాగి ఘర్షణ పడేవాడు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తినిందితుడికి 225 రోజుల జైలుశిక్ష విధించారు.