అసాధ్యంగానే మిగిలిన ‘ఫ్లైట్‌ స్వాపింగ్‌’

ABN , First Publish Date - 2022-04-26T08:03:57+05:30 IST

ప్రపంచలోనే తొలిసారిగా ఆకాశంలో ఫ్లైట్‌ స్వాపింగ్‌ పూర్తి చేసి రికార్డు సృష్టించాలన్న ఇద్దరు అమెరికన్‌ పైలెట్ల కల నెరవెరలేదు.

అసాధ్యంగానే మిగిలిన ‘ఫ్లైట్‌ స్వాపింగ్‌’

ఎలాయ్‌(యునైటెడ్‌ స్టేట్స్‌), ఏప్రిల్‌ 25 : ప్రపంచలోనే తొలిసారిగా ఆకాశంలో ఫ్లైట్‌ స్వాపింగ్‌ పూర్తి చేసి రికార్డు సృష్టించాలన్న ఇద్దరు అమెరికన్‌ పైలెట్ల కల నెరవెరలేదు. రెడ్‌ బుల్‌ ఆధ్వర్యంలో ఆరిజోనా ఏడారి ప్రాంతంలో ఆదివారం ఈ సాహసం చేసిన ల్యూక్‌ ఐకిన్స్‌, ఆండీ ఫారింగ్టన్‌ అనే పైలెట్లు దాన్ని విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. 14,000 అడుగుల ఎత్తులో ఉండగా తన విమానం నుంచి బయటకొచ్చిన ల్యూక్‌.. స్కై డైవింగ్‌ చేస్తూ సహచరుని ఫ్లైట్‌లోకి ఎక్కేశాడు. ఆ విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సురక్షితంగా ల్యాండ్‌ చేశాడు. కానీ, తన ఫ్లైట్‌ నుంచి బయటకొచ్చిన ఫారింగ్టన్‌ మాత్రం ల్యూక్‌ ఫ్లైట్‌ను చేరుకోలేకపోయాడు. ఫారింగ్టన్‌ పారాచ్యూట్‌ సాయంతో భూమి మీదకు రాగా.. ఆ విమానం ఎలాయ్‌కు 105 కిలోమీటర్ల దూరంలో క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. అయితే, ఈ సాహసం చేసేందుకు తాము నిర్వాహకులకు అనుమతి ఇవ్వలేదని ప్రకటించిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎ్‌ఫఏఏ) విచారణకు ఆదేశించింది.  

Updated Date - 2022-04-26T08:03:57+05:30 IST