Advertisement
Advertisement
Abn logo
Advertisement

207 మందికి కృత్రిమ అవయవాల అమరిక

తాండూరు: మార్వాడీ యువమంచ్‌ తాండూరు ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొనసాగుతున్న కృత్రిమ అవయవాల అమరిక, కాలిఫర్‌ శిబిరం బుధవారం ముగిసింది. ఈ శిబిరంలో 190మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారికి కొలతలు తీసుకొని కృత్రిమ కాళ్లు అమర్చారు. కాలిఫర్లకు 9, 10 తేదీల్లో అమర్చుతామని శిబిరం చైర్మన్‌ సునిల్‌ సార్డా తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సొంత ఖర్చులతో కొందరిని క్యాంప్‌నకు పంపించి నిర్వాహకులకు ఫోన్‌ చేశారని క్యాంప్‌ చైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సన్నీ అగర్వాల్‌, టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement