red alert:వచ్చే మూడు రోజులపాటు 9 రాష్ట్రాల్లో భారీవర్షాలు...ఐఎండీ హెచ్చరిక జారీ

ABN , First Publish Date - 2022-10-04T14:29:12+05:30 IST

దేశంలోని 9 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(India Meteorological Department) (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది....

red alert:వచ్చే మూడు రోజులపాటు 9 రాష్ట్రాల్లో భారీవర్షాలు...ఐఎండీ హెచ్చరిక జారీ

న్యూఢిల్లీ: దేశంలోని 9 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(India Meteorological Department) (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలైన సౌత్ 24 పరగణాస్, పుర్బా, పశ్చిమ మేదీనీపూర్, కోల్ కతా ప్రాంతాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD predicts) పేర్కొంది. ఉరుములు,మెరుపులతో కూడిన భారీవర్షాల వల్ల దుర్గా పూజ ఉత్సవాలకు(Durga Puja festivities) ఆటంకం కలగనుంది. 


ఉత్తర బెంగాల్, డార్జిలింగ్, కలింపొంగ్ ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుమాన్, గర్హాల్ ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశమున్నందున ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ(red alert issued) చేశారు. వచ్చే రెండు రోజుల్లో అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో(Andhra Pradesh coast) వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది. ఒడిశా, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర,నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లోను భారీవర్సాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు. 


Updated Date - 2022-10-04T14:29:12+05:30 IST