Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 26 2021 @ 09:37AM

yellow alert: దేశంలో నేడు పలు చోట్ల భారీవర్షాలు

న్యూఢిల్లీ : ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సోమవారం (నేడు) భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ విభాగం (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వర్షంతోపాటు భారీ గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఢిల్లీలో ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్షియస్ నమోదైంది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నజీబాబాద్, బిజనోర్, చాంద్ పూర్, షామ్లీ, రాంపూర్, హస్తినాపూర్, దేవ్ బంద్, ముజప్ఫఱ్ నగర్, ఖటోలి, సహరాన్ పూర్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్ ప్రాంతాల్లో రాగల రెండుగంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీవర్షాలు కురవనున్నందున ఉరుములు,మెరుపులతో భారీవర్షాలు కురుస్తాయని భోపాల్ వాతావరణశాఖ సీనియర్ అధికారి పీకే సాహా చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పుర్, నరసింగ్ పూర్, బాలాఘాట్, టికంఘడ్, చాత్రాపూర్ తదితర 23 జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని, దీంతో ఆరంజ్ అలర్ట్ జారీ చేశామని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. 


Advertisement
Advertisement