భారతీయ వైద్య సేవలను స్థాపించాలి: ఐఎంఏ

ABN , First Publish Date - 2020-07-12T06:57:16+05:30 IST

వైద్య రంగంలో గణనీయమైన మార్పులు తెచ్చేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ తరహాలో భారతీయ వైద్య సేవలను (ఐఎంఎస్‌) ఏర్పాటు చేయాలని భారతీయ వైద్య సంఘం...

భారతీయ వైద్య సేవలను స్థాపించాలి: ఐఎంఏ

న్యూఢిల్లీ, జూలై 11: వైద్య రంగంలో గణనీయమైన మార్పులు తెచ్చేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ తరహాలో భారతీయ వైద్య సేవలను (ఐఎంఎస్‌) ఏర్పాటు చేయాలని భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వైద్య రంగంలో గణనీయమైన మార్పులు తేవాల్సిన అవసరం ఉందని, ఐఎంఎ్‌సను నెలకొల్పడం ద్వారా మాత్రమే ఈ మార్పులను తేవచ్చని ఐఎంఏ పేర్కొంది. జిల్లా వైద్యాధికారి, వివిధ వ్యాధి నియంత్రణ కార్యక్రమాల ప్రాజెక్టు అధికారులు, కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ, రాష్ట్ర వైద్య విభాగాల్లో  కార్యదర్శుల వివిధ ర్యాంకులకు సంబంధించిన పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించడానికి ఐఎంఎ్‌సను నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ అన్నారు. ఐఎంఎస్‌ పరీక్ష రాసేందుకు కనీస అర్హత ఎంబీబీఎస్‌ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2020-07-12T06:57:16+05:30 IST