సీఎం కావడానికి తొందరేమీ లేదు: డీకే శివకుమార్

ABN , First Publish Date - 2021-06-24T01:30:41+05:30 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు..

సీఎం కావడానికి తొందరేమీ లేదు: డీకే శివకుమార్

బెంగళూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు పరస్పర భిన్నమైన ప్రకటనలు చేస్తుండటంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ బుధవారంనాడు స్పందించారు. సీఎం పదవిపై తాను దృష్టి పెట్టలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం పైనే తన శక్తియుక్తులు కేంద్రీకరిస్తున్నానని చెప్పారు.


''ముఖ్యమంత్రి పదవి విషయంలో నాకేమీ తొందర లేదు. కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే నా ఎజెండా. ఇందుకోసం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నా సేవలను ఉపయోగించుకోవచ్చని చెప్పాను. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రకటనలు చూశాను. సిద్ధరామయ్య కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత. ఆయన ఆ విషయం చూసుకుంటారు. ఆయన ఆ పని చేయకున్నప్పటికీ కాంగ్రెస్ రాష్ట్రంలో సజీవంగానే ఉంటుంది'' అని డీకే చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏ సీటూ ఖాళీగా లేదని, తమ రేస్ అంతా కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసమేనని అన్నారు. వేరే విషయాలపై దృష్టిని పక్కదారి పట్టించకుండా బీజేపీకి వ్యతిరేకంగా అంతా పోరాటం సాగించి, ఓడించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని డీకే సూచించారు.

Updated Date - 2021-06-24T01:30:41+05:30 IST