అక్రమంగా తరలిపోతున్న కలప

ABN , First Publish Date - 2022-08-19T04:46:35+05:30 IST

గుర్రంకొండ మండలంలో కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న పట్టించుకునేవారు కరువయ్యారు.

అక్రమంగా తరలిపోతున్న కలప
గుర్రంకొండ సమీపంలో రైతన్నల పొలాల్లో చెట్లను నరుకుతున్న కూలీలు(పైల్‌ ఫొటో)

గుర్రంకొండ, ఆగస్టు 18:గుర్రంకొండ మండలంలో కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న పట్టించుకునేవారు కరువయ్యారు. ర కలప వ్యా పారుల అక్రమ ధనార్జనకు పచ్చదనం షా మిల్లులు, ఇటుక బట్టీలల్లో  కాలి బుడిదవుతోంది. ప్రభుత్వ భూములలోని భారీ వృక్షాలను సైతం గుట్టు చప్పుడు కాకుండా నరికేస్తున్నారు. ముఖ్యంగా అక్రమ కలప రవా ణా ఆదివారం రోజున విచ్చల విడిగా జరుగుతోంది. దీంతో గ్రామా లు, అటవీ ప్రాంతాలల్లోనున్న వృక్షాలు గొడలి వేటుకు నేలకొరుగుతు న్నాయి. మండలంలోని తరిగొండ, శెట్టివారిపల్లి, టి.పసలవాండ్లపల్లి, చెర్లోపల్లి, సరిమడుగు, ఎల్లుట్ట, మర్రిపాడు, నడిమిఖండ్రిగ, సంగసముద్రం, అమి లేపల్లి, గుర్రంకొండ గ్రామాల్లో చెట్లను నరికివేస్తున్నారు. రైతన్నల పొలా ల్లో ఉన్న వృక్షాలను ఎటువంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారం నేలకూల్చుతు న్నారు. టేకు, వేప, చింత, మద్ది, రాగి, మర్రి, మామిడి, చిగురు, కానుగ, సండ్ర వృక్షాలను నిత్యం కలప వ్యాపారులు నరికేస్తు న్నారు. అంతేకాకుం డా ప్రభుత్వ భూములల్లో ఉన్న భారీ వృక్షాలను అడ్డంగా నరికి సొమ్ము చేసుకొంటున్నా అటు రెవెన్యూ..ఇటు అట వీశాఖ అధికారులు  చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నా విమర్శలున్నా యి. వారి అక్రమ వ్యాపా రానికి అటవీశాఖాధికారులు అండదండలు పుష్కలంగా ఉండడంతో కలప రవాణా జోరుగా సాగుతోంది. సంబంధిత అధికారులు తగు చర్య లు తీసుకుని చెట్లను నరకకుండా చూడాలని రైతన్నలు కోరుతున్నారు. 


అనుమతుల్లేకుండా చెట్లను నరికితే చర్యలు

అధికారులు అనుమతుల్లేకుండా చెట్లను నరకడం చట్టరీత్యా చర్యలు తప్పవని అటవీశాఖ సంగసముద్రం పరిధి బీట్‌ అధికారి రామ్‌మోహన్‌ తెలిపారు. అక్రమ కలప రవాణాపై ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా అటవీశాఖ అధికారులు అనుమ తులు లేకుండా వృక్షాలను నరక రాదన్నారు. గుర్రంకొండ మండలంలో అక్రమ కలప రవాణాను అరికడు తామన్నారు. అక్రమ కలప రవాణాపై కేసు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2022-08-19T04:46:35+05:30 IST