ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-07-14T11:44:08+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడం దారుణమని ఈ అక్రమ బదిలీలను వెంటనే

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలి

ప్రొద్దుటూరు టౌన్‌, జూలై 13: రాష్ట్ర వ్యాప్తంగా  ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడం దారుణమని ఈ అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడు స్తూ ప్రభుత్వమే నేరుగా దొడ్డిదారిన బదిలీలు చేపట్టడం వల్ల ఉపాధ్యాయు లు నష్టపోతారన్నారు.


అక్రమ బదిలీల వల్ల తొమ్మిది సంవత్సరాలుగా బది లీ కోసం ఎదురుచూస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందన్నారు.  ముఖ్యమంత్రి  జోక్యం చేసుకుని కౌన్సెలింగ్‌ ద్వారా పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని  కోరారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీల రద్దు కోరుతూ ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన డీఈవో కార్యాలయాల వద్ద నిరసన నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2020-07-14T11:44:08+05:30 IST