శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-10-29T05:08:51+05:30 IST

అచ్చంపేట ము నిసిపాలిటీలోని మల్లమ్మకుంట శిఖం భూమిలో యథేచ్చగా వ్యాపారం చేస్తున్నారు.

శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు
మల్లమ్మకుంటలో కూల్చి వేసిన షాపులలో దందా కొనసాగిస్తున్న వ్యాపారులు

- కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములు  

- నాయకుల అండతో నిర్మాణాలు 

అచ్చంపేటటౌన్‌, అక్టోబరు 28: అచ్చంపేట ము నిసిపాలిటీలోని మల్లమ్మకుంట శిఖం భూమిలో  యథేచ్చగా వ్యాపారం చేస్తున్నారు. పట్టణం నడి బొడ్డున సర్వే నెంబర్‌ 280లో ఉన్న భూమి గతం నుంచి వివాదంలో ఉన్నది. నాయకుల అండతో అ క్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూముల విలు వ పెరగడంతో కబ్జాలు విచ్చలవిడిగా సాగుతున్నా యి. శిఖం భూముల కబ్జాలు అరికట్టకపోతే భవి ష్యత్తులో ప్రభుత్వ భూములు మిగిలేది ప్రశ్నా ర్థకంగా మారిందని పలువురు అభ్రిపాయ పడుతు న్నారు. ప్రభుత్వ భూములల్లో రాత్రికి రాత్రే అక్రమ కట్టాడాలు వెలుస్తున్నాయి.

దుకాణ సముదాయాల కూల్చివేత

గతంలో శిఖం భూమిలో నిర్మించిన అక్రమ కట్ట డాలను మునిసిపల్‌ చైర్మన్‌ కొంతమేర తొలగించి నప్పటికీ వ్యాపారులు తొలగించిన దుకాణాలలో వ్యాపారం చేసుకుంటున్నారు. మునిసిపల్‌ అధికా రులు నామ మాత్రంగా చర్యలు తీసుకోవడంతో ఏలాంటి ఉపయోగం లేకుండా పోయిందని తక్ష ణమే శిఖం భూమిలో ఏర్పాటు చేసిన షాపులను పూర్తిగా తొలగించాలని  ప్రజలు కోరుతున్నారు. ప ట్టణం నడిబోడ్డున ఉన్న ప్రభుత్వ భూమికి డి మాండ్‌ పెరగడంతో  16 గుంటల భూమికి  6 గుంటలు కూడా లేకపోవడం గమనార్హం. ఉన్న కొంత భూమిని కూడా నాయకుల అండతో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు పూనుకున్నారు.  

రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ...

మల్లమ్మ కుంటను మినీ ట్యాంకుబండ్‌గా  మా రుస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చి ఏడేళ్లు అవుతున్నా అభివృద్ధి పనులు జరగలేదు. కానీ అక్రవ నిర్మాణాలు మాత్రం చేపట్టారు. అక్రమ ని ర్మాణాలు తొలగించాలని హైకోర్టు స్టే ఇచ్చినా అధి కారులు నామమాత్రంగా తొలగించినట్లు చేసి  వ ది లేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడితోనే చెరు వులు కనుమరుగై పోతున్నాయి. చెరువులను కాపా డుకునేందుకు త్వరలోనే నిరాహార దీక్షలు చేపడ తాము.

-మల్లేష్‌, ముదిరాజుసంఘం తాలుకా అధ్యక్షుడు, అచ్చంపేట 


Updated Date - 2021-10-29T05:08:51+05:30 IST