రవికుమార్‌ను ఎదుర్కోలేకే అక్రమ కేసులు

ABN , First Publish Date - 2021-04-12T04:55:26+05:30 IST

టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ను ఎదు ర్కోలేకే ఆయనపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం వైసీపీ నాయకులతో తప్పుడుకేసులు పెట్టిస్తున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, జడ్పీటీసీ అభ్యర్థి బలగ శంకర భాస్కర్‌, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు అన్నెపు రాము ఆరోపించారు.

రవికుమార్‌ను ఎదుర్కోలేకే అక్రమ కేసులు
మాట్లాడుతున్న పొందూరు టీడీపీ నాయకులు

టీడీపీ నాయకులు

పొందూరు:  టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ను ఎదు ర్కోలేకే ఆయనపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం వైసీపీ నాయకులతో తప్పుడుకేసులు పెట్టిస్తున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, జడ్పీటీసీ అభ్యర్థి బలగ శంకర భాస్కర్‌,  ఏఎంసీ మాజీ అధ్యక్షుడు అన్నెపు రాము ఆరోపించారు. ఆదివారం పొందూరులో వారు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపై దాడిచేసిన వైసీపీ నేతలను విడిచిపెట్టి ప్రశ్నించిన రవికుమార్‌, 60 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమకేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. సంఘటనకు  కా రకుడైన పెనుబర్తి ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.  పీఏసీఎస్‌ మాజీ ఉపాధ్యక్షుడు కె.అప్పలనాయుడు  పాల్గొన్నారు.


తప్పుడు కేసులు పెట్టి అడ్డుకోలేరు

ఆమదాలవలస: టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు  కూన రవికుమార్‌పై తపుడు కేసులుపెట్టి రాజకీయంగా అడ్డుకోలేరని పార్టీ పట్టణ  అధికార ప్రతినిధి తమ్మినేని విద్యాసాగర్‌ తెలిపారు. ఆదివారం ఆమదాలవలసలో టీడీపీ పట్టణాధ్యక్షుడు బోర గోవిందరావు, పార్టీ మండలాధ్యక్షుడు నూకరాజు, నారాయణపురం ఆయకట్టు సంఘం మాజీ అధ్యక్షుడు అమర్‌నాధ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.   వైసీపీ యువజన విభాగం నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికార పార్టీ నాయకులు అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు కార్యకర్తలపై తపుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.  పోలీసులు అధికార పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు చేసిన తప్పిదాలను తమ నాయకుడు ప్రశ్నిస్తునే ఉంటారని, ప్రజల పక్షాన నిలబడేందుకు ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకుసిద్ధమేనని గుర్తుంచుకోవాలన్నారు.  సమావేశంలో నాయకులు లక్ష్మణరావు, గుడ్ల ప్రసాద్‌, దవల అప్పలనాయుడు  పాల్గొన్నారు.  సరుబుజ్జిలి: పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారడం తగదని టీడీపీ  రాష్ట్ర  కార్యదర్శి శివ్వాల సూర్యనారాయణ హితవు పలికారు. ఆదివారం పెద్ద సవళాపురంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పెనుపర్తిలో ఇటీవల జరిగిన  ఎంపీటీసీ ఎన్నికల్లో హింస చోటుచేసుకోకుండా చర్యలు తీసుకో వల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు.  

Updated Date - 2021-04-12T04:55:26+05:30 IST