Abn logo
Aug 2 2020 @ 04:22AM

అక్రమ మద్యం స్వాధీనం

సత్తెనపల్లి, ఆగస్టు1: రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం ఆర్‌ఆర్‌ సెంటర్‌లో ఇనోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న  906 మద్యంబాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌, సీఐ మారయ్యబాబులు తెలిపారు. మద్యం తరలిస్తున్న పెనుమూడి చిన్నా, బెజవాడ గోపిలను అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్‌ ఎస్సై షరీఫ్‌, సిబ్బంది కూడా పాల్గొన్నారని ఆయన తెలిపారు. 


తాడికొండ: మండలం రావెలలో అక్రమంగా తెలంగాణ మద్యం అమ్ముతున్న ముసలయ్య అనే వ్యకి వద్ద నుంచి 280 మద్యం సీసాలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ సీహెచ్‌ రాజశేఖర్‌ తెలిపారు. 


మాచవరం: తెలంగాణా రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం సీసాలు తీసుకొస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 134 మద్యం సీసాలను స్వాఽధీనం చేసుకొన్నట్లు మాచవరం ఎస్సై లక్ష్మీనారాయణరెడ్డి శనివారం తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement