ఫ్యూచర్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో IITH Certificate Course

ABN , First Publish Date - 2022-06-30T20:30:50+05:30 IST

ఫ్యూచర్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో పన్నెండు నెలలు అంటే ఒక ఏడాది కాలవ్యవధి కలిగిన సర్టిఫికెట్‌ కోర్సును ఐఐటీ హైదరాబాద్‌ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి క్లాసులు అరంభమవుతాయి

ఫ్యూచర్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో IITH Certificate Course

ఫ్యూచర్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో పన్నెండు నెలలు అంటే ఒక ఏడాది కాలవ్యవధి కలిగిన సర్టిఫికెట్‌ కోర్సును ఐఐటీ హైదరాబాద్‌ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి క్లాసులు అరంభమవుతాయి. డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌ ఉత్తీర్ణులు లేదా ఆఖరు ఏడాది కోర్సు చేస్తున్న విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఈ కోర్సును నాలుగు మాడ్యూల్స్‌గా విభజించారు. అలాగే ఏదైన ఒక మాడ్యూల్‌ పూర్తి చేసి సర్టిఫికెట్‌తో వెళ్ళిపోవచ్చు. దీనికి ఎంపికైన అభ్యర్థులకు ప్రోగ్రామ్‌ పూర్తయ్యే వరకు నెలకు  రూ.25,000 స్కాలర్‌షి్‌పగా లభిస్తుంది. దీనికితోడు ‘ఐఐటీహెచ్‌ 6జీ రీసెర్చ్‌ ప్రాజెక్టు’లో 50 వరకు  ప్రి-ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌, 200 ఆర్‌అండ్‌డి ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పొజిషన్స్‌ ఉన్నాయి. జూలై 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: http://fwc.iith.ac.in/ 

Updated Date - 2022-06-30T20:30:50+05:30 IST