కొవిడ్ containment zoneగా కోల్‌కతా ఐఐఎం క్యాంపస్

ABN , First Publish Date - 2022-01-05T16:53:31+05:30 IST

కరోనా కేసుల పెరుగుదలతో విద్యార్థులు కోల్‌కతా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) క్యాంపస్‌ను వదిలి వెళ్లాలని కాలేజీ యాజమాన్యం ఆదేశించింది....

కొవిడ్ containment zoneగా కోల్‌కతా ఐఐఎం క్యాంపస్

హాస్టళ్లు వదిలివెళ్లాలని విద్యార్థులకు ఆదేశాలు

కోల్‌కతా: కరోనా కేసుల పెరుగుదలతో విద్యార్థులు కోల్‌కతా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) క్యాంపస్‌ను వదిలి వెళ్లాలని కాలేజీ యాజమాన్యం ఆదేశించింది. కోల్‌కతా ఐఐఎంలోని 61 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ఐఐఎం క్యాంపస్‌లోని టాటా హాల్స్, రామానుజన్ హాస్టల్, లేక్ వ్యూ హాస్టల్, న్యూ హాస్టల్‌లను కంటెయిన్‌మెంట్  జోన్లుగా ప్రకటించారు. కంటెయిన్ మెంట్ జోనుకు వెలుపల నివశిస్తున్న విద్యార్థులు ఈ నెల 9వతేదీలోగా క్యాంపస్ వదిలి వెళ్లాలని కోల్‌కతా ఐఐఎం ఆదేశించింది. గత కొన్ని రోజులుగా ఐఐఎం క్యాంపస్ లో కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్ యొక్క తాత్కాలిక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.


కంటెయిన్ మెంట్ జోన్ వెలుపల ఉన్న ఠాగూర్ హాస్టల్, అనెక్స్ హాస్టల్ బోర్డర్లు ఈ నెల 9వతేదీలోగా క్యాంపస్‌ను విడిచి పెట్టాలని కోరినట్లు కమిటీ సభ్యుడు చెప్పారు.కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ నియంత్రణ పరిమితులను ఎత్తివేసిన తర్వాత టాటా హాల్స్, రామానుజన్ హాస్టల్, లేక్ వ్యూ హాస్టల్, న్యూ హాస్టల్‌ విద్యార్థులకు ఆర్డర్ అమలులోకి వస్తుందని ఐఐఎంసీ అధికారి ఒకరు తెలిపారు. క్యాంపస్ ను ఖాళీ చేసే వరకు విద్యార్థులెవరూ ప్రాంగణం వెలుపల వెళ్లడానికి అనుమతించమని అధికారులు చెప్పారు.కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్‌పర్సన్ మనీష్ ఠాకూర్ చెప్పారు.



రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయాణ ఆంక్షలు విధిస్తే, ఇంటికి చేరుకోవడానికి అసౌకర్యంగా ఉంటుందని విద్యార్థులను ఇళ్లకు వెళ్లాలని సూచించినట్లు మరో కమిటీ సభ్యుడు తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా విద్యార్థులు కోల్‌కతాలోని రద్దీప్రాంతాలకు వెళ్లడం వల్ల క్యాంపస్‌లో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగిందని అధ్యాపకులు చెప్పారు.ఖరగ్ పూర్ ఐఐటీలోని 60 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కొంతమంది విద్యార్థులు క్రిస్మస్ సందర్భంగా కోల్‌కతాకు వెళ్లారని, వారు తిరిగి వచ్చిన తర్వాత కొవిడ్ ఇన్ఫెక్షన్ రేటు మరింత పెరిగిందని ఖరగ్‌పూర్ ఐఐటీ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-05T16:53:31+05:30 IST