కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-06-24T04:08:04+05:30 IST

కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
సీతమ్మధార కూడలిలో నిరసన తెలియజేస్తున్న ఇఫ్టూ ప్రతినిధులు

బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ఇఫ్టూ డిమాండ్‌

సీతమ్మధార, జూన్‌ 23: కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సీతమ్మధార కూడలి అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనాను జాతీయ విపత్తుగా పరిగణించాలన్నారు. గ్యాస్‌, హమాలి కార్మికులను, జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించాలన్నారు. వైద్యాన్ని, విద్యని జాతీయం చేయాలని కోరారు.  ప్రైవేట్‌ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉచితంగా ప్రజలందరికీ కోవిడ్‌ వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు.విద్య, వైద్య రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని కోరారు. తెల్లకార్డు లబ్ధిదారులకు నెలకు రూ.10వేలు చొప్పున చెల్లించి ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయాలన్నారు. రేషన్‌ కార్డులేని చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు నెలకు రూ.5 వేలు చెల్లించాలని కోరా రు. నిరసనలో ఇఫ్లూ నాయకులు, గ్యాస్‌వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నాయుడు,శ్రీను,రమణ, నారాయణ పాల్గొన్నారు.


పెట్రో ధరలు తగ్గించాలని సీపీఐ డిమాండ్‌

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో ధరలు తక్షణం తగ్గించా లని సీపీఐ నగర సమితి సభ్యుడు పడాల గోవింద్‌ డిమాండ్‌ చేశారు. సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద 15, 16 వార్డుల ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని, ఆస్తిపన్ను పెంపు జీవోలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎన్‌.మధురెడ్డి, లక్ష్మణరెడ్డి, నూకరాజు, శంకర్‌, రమణ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T04:08:04+05:30 IST