Advertisement
Advertisement
Abn logo
Advertisement

తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు

కోదాడటౌన్‌, అక్టోబరు 25: ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ అన్నారు. కోదాడలోని తన క్యాంపు కార్యా లయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మద్యం విక్రయాలకు కొత్తగా ఎవరిని తీసుకురాలేద్దన్నారు.నీతి, నిజాయితీగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనను విమర్శించడం సరికాదన్నారు. సూర్యాపేటలో కారులో కాలిన డబ్బులు ఎక్కడివో ఉత్తమ్‌కుమార్‌ చెప్పాలన్నారు. సొంత ఆస్తులు విక్ర యించి కోదాడలో ఇంటిని నిర్మించుకుంటుంటే, రాజకీయం చేయడం ఉత్తమ్‌కు తగదన్నారు. ఎవరి సత్తా ఏమిటో ప్రజా క్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. Advertisement
Advertisement