Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్వీట్‌ తినాలనిపిస్తే?

ఆంధ్రజ్యోతి (24-11-2020): ఒత్తిడి, అలసట, నిద్రలేమి... తీపి తినాలనిపించటానికి ప్రధాన కారణాలు. శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందించటం కోసం తీపి మీదకు మనసు మళ్లుతుంది. ఈ ఫీలింగ్‌ రాగానే తీపి పదార్థాల కోసం వెతకకండి. ఒకసారి తీపి తినటం మొదలుపెడితే అది అలాగే అలవాటు అవుతుంది. కాబట్టి స్వీట్ల జోలికి వెళ్లకుండా మూల కారణాల్ని సరిదిద్దటం మీద మనసు పెట్టండి. 


స్వీట్ల మీద ఇష్టం పెరగటానికి వ్యాయామం లేకపోవటం మరో కారణం. శరీరం చురుగ్గా లేనప్పుడు బద్ధకం ఆవరిస్తుంది. దాంతో మనసు కప్‌ కేక్స్‌, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. కాబట్టి ఏదో ఒక శారీరక వ్యాయామం చేయడం తప్పనిసరి.


షుగర్‌ క్రేవింగ్‌కు డీహైడ్రేషన్‌ మరో కారణం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు చక్కెర పదార్థాలు తినాలనిపిస్తుంది. ఈ కోరిక కలగకూడదంటే వెంటనే నీళ్లు తాగాలి. 

Advertisement
Advertisement