Russian President పుతిన్ ఓ మహిళ అయి ఉంటే... : బ్రిటిష్ పీఎం బోరిస్ జాన్సన్

ABN , First Publish Date - 2022-06-29T21:58:59+05:30 IST

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఓ మహిళ అయి ఉంటే,

Russian President పుతిన్ ఓ మహిళ అయి ఉంటే... : బ్రిటిష్ పీఎం బోరిస్ జాన్సన్

బెర్లిన్ : రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఓ మహిళ అయి ఉంటే, ఆయన ఉక్రెయిన్‌పై యుద్ధం చేసి ఉండేవారు కాదని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson) అన్నారు. ఉక్రెయిన్‌పై దాడి దూకుడు స్వభావంతో కూడిన మగతనపు లక్షణాలకు నిదర్శనమని చెప్పారు. జర్మన్ మీడియా మంగళవారం రాత్రి ఈ వివరాలను వెల్లడించింది. 


ప్రపంచంలో బాలికలు, మహిళలు విద్యావంతులు కావాలని, బాలికలకు మెరుగైన విద్యను అందించాలని పిలుపునిచ్చారు. మరింత ఎక్కువ మంది మహిళలు అధికార స్థానాల్లోకి రావాలన్నారు. పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేయడం దూకుడు స్వభావంగల మగతనపు లక్షణాలకు నిదర్శనమని చెప్పారు. ఈ యుద్ధం ముగిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఒప్పందం లేదన్నారు. పుతిన్ శాంతి ఒప్పందం కోసం ముందుకు రావడం లేదని చెప్పారు. రష్యాతో శాంతి చర్చలు సాధ్యమైతే ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా మెరుగైన స్థితిలో ఉండటం కోసం పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలవాలన్నారు. 


Updated Date - 2022-06-29T21:58:59+05:30 IST