పనితీరు మెరుగు పరుచుకోకుంటే ఇంటికే..

ABN , First Publish Date - 2021-02-26T04:24:37+05:30 IST

ఇచ్చిన టాస్క్‌లో పనితీరు మెరుగు పరుచుకోవాలని లేకుంటే సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ సంయుక్త సం చాలకుడు మురళీకృష్ణ సూచించారు.

పనితీరు మెరుగు పరుచుకోకుంటే ఇంటికే..
వీహెచ్‌ఏ, వీఏఏల సమావేశంలో జేడీఏ మురళీకృష్ణ వెల్లడి

ముద్దనూరు ఫిబ్రవరి25: రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న గ్రామ వ్యవ సాయ అసిస్టెంట్లు(వీఏఏ), గ్రామ ఉద్యాన శాఖ అసిస్టెం ట్లు(వీహెచ్‌ ఏ)లకు ఇచ్చిన టాస్క్‌లో పనితీరు మెరుగు పరుచుకోవాలని లేకుంటే సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ సంయుక్త సం చాలకుడు మురళీకృష్ణ సూచించారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో గురువారం ముద్దనూరు, కొండాపురం సింహాద్రిపురం, తొండూరుమండలాల వీహెచ్‌ఏ, వీఏఏలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు రకాల టాస్క్‌లు వైఎ్‌సఆర్‌ యాప్‌లో ఇవ్వడం జరిగిందని ప్రతి రోజు వాటిని అప్‌లోడ్‌ చేయాలన్నారు. వైఎ్‌సఆర్‌ యాప్‌లో పనితీరు బాగాలేదని వస్తే సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉందన్నారు. సీఎం యాప్‌లో ఎంఎ్‌సపీ ధర అప్‌లోడ్‌ చేయాలన్నారు. 539 కస్టమ్‌ఐరింగ్‌ సెంటర్లు, నియోజకవర్గంలోని హబ్‌లు మార్చి 15లోపు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. అంతకు ముందు శెట్టివారిపల్లె గ్రామంలో వేరుశనగ పంటలో సస్యరక్షణ చర్యల పై రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అనిత, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో ఎరువులు

కొండాపురం, ఫిబ్రవరి 25: రైతు బరోసా కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఎరువులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ జాయిం ట్‌ డైరెక్టర్‌ మురళికృష్ణ తెలిపారు. ఓబన్నపేట రైతు భరోసా కేంద్రాన్ని  నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని గురువారం ఆయ న పరిశీలించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రంలో రికార్డులను తనిఖీ చేశారు. స్థానికంగా క్రిమిసంహారక మందులు తయారు చేసే మందుల ఫ్యాక్టరీని పరిశీలించి మందుల తయారీలో నాణ్యత పాటించాలని యజమానులకు సూచించా రు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు ఏడీ అనిత, ఏఓ జ్ఞానేంద్రమణి, ఎంపీఈఓ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-26T04:24:37+05:30 IST