కరోనా సోకితే... వంధ్యత్వం..!

ABN , First Publish Date - 2020-07-03T01:27:38+05:30 IST

కరోనా సోకితే మరో ముప్పు ఎదురు కానున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. రష్యా పరిశోధకులు వెల్లడించిన మేరకు... కొవిడ్-19 సోకిన వారిలో వీర్య కణాల సంఖ్య తగ్గుతోంది. అంతేకాక... ఈ పరిస్థితి... వంధ్యత్వానికి (ఇన్‌ఫర్టిలిటీ) కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదని రష్యా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

కరోనా సోకితే... వంధ్యత్వం..!

మాస్కో : కరోనా సోకితే మరో ముప్పు ఎదురు కానున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. రష్యా పరిశోధకులు వెల్లడించిన మేరకు... కొవిడ్-19 సోకిన వారిలో వీర్య కణాల సంఖ్య తగ్గుతోంది. అంతేకాక... ఈ పరిస్థితి... వంధ్యత్వానికి (ఇన్‌ఫర్టిలిటీ) కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదని రష్యా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.


తమ వైద్య నిపుణులు చేసిన అధ్యయనం ద్వారా నమోదు చేసిన ఫలితాలను మాస్కోకు చెందిన చీఫ్ గైనకాలజిస్ట్ ఎలినా వెల్లడించారు. కొవిడ్‌-19 తో బాధ‌ప‌డిన వారిలోనే వంధ్యత్వ సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కరోనా వైర‌స్ నుంచి కోలుకున్న మ‌గ‌వారిలో వీర్య క‌ణాల సంఖ్య 38 శాతం మేర త‌గ్గిన‌ట్లు నిపుణులు గుర్తించారు.


ఇది ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశ‌మ‌ని పేర్కొన్నారు. నిజానికి రష్యాకు చెందిన పురుషుల్లో వీర్యకణాల నాణ్యత తక్కువే ఉంటుండగా... కోవిడ్ ప్రభావంతో వారిలో వీర్యకణాల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. కాగా... వీర్యకణాల్లోకి కూడా వైర‌స్ చొచ్చుకుపోతున్నట్లుగా ఇప్పటికే కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.


వృష‌ణాల‌ను క‌రోనా వైర‌స్ పాక్షికంగా దెబ్బతీసే అవ‌కాశమున్నట్లుెగా చైనా-అమెరికా గతంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-07-03T01:27:38+05:30 IST