సింగిల్‌ పర్మిట్‌ ఇవ్వకపోతే

ABN , First Publish Date - 2021-07-26T07:04:19+05:30 IST

రెండు తెలుగు రాష్ర్టాల్లో నడిపేందుకులారీలకు సింగిల్‌ పర్మిట్‌ ఇవ్వకపోతే ఆరు వేల మందితో రాష్ట్ర సరిహద్దును దిగ్బంధిస్తామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, చాంద్‌పాష హెచ్చరించారు

సింగిల్‌ పర్మిట్‌ ఇవ్వకపోతే
సమావేశంలో మాట్లాడుతున్న లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి

ఆరు వేల మందితో రాష్ట్ర సరిహద్దును దిగ్బంధిస్తాం

లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి 


దేవరకొండ, జూలై 25 : రెండు తెలుగు రాష్ర్టాల్లో నడిపేందుకులారీలకు సింగిల్‌ పర్మిట్‌ ఇవ్వకపోతే ఆరు వేల మందితో రాష్ట్ర సరిహద్దును దిగ్బంధిస్తామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, చాంద్‌పాష హెచ్చరించారు. కొండమల్లేపల్లిలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సమావేశానికి వారు ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచడంతో లారీ ఓనర్లపై అధిక భారం పడిందన్నారు. దేశవ్యాప్తంగా సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలవుతున్నా తెలు గు రాష్ర్టాల్లో అమలు చేయడంలేదన్నారు. కరోనా సమయంలో లారీ ట్యాక్సీలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పి అమలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తైబజార్‌ కట్టవద్దని చెప్పినా  డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. లారీ ఓనర్ల పరిస్థితి దయనీయంగా మారినందున  ప్రభుత్వాలు స్పందించి ట్యాక్సీలు మాఫీ  చేయడంతోపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని కోరారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతుందన్నారు. 29 అసోసియేషన్లు ఏకమై ఉమ్మడి జిల్లాలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికైన నూతన కమిటీ లారీ ఓనర్లకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ మాజీ రాష్ట్రఅధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటనారాయణ, రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, దేవరకొండ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు హనుమంతు వెంకటే్‌షగౌడ్‌, ఉమ్మడి జిల్లాలోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-26T07:04:19+05:30 IST