మయన్మార్ సరిహద్దుల్లో పేలుడు పరికరాల స్వాధీనం

ABN , First Publish Date - 2022-02-24T12:48:59+05:30 IST

ణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మయన్మార్ సరిహద్దు సమీపంలో అధునాతన పేలుడు పరికరాలను సాయుధ దళాలు స్వాధీనం చేసుకున్నాయి...

మయన్మార్ సరిహద్దుల్లో పేలుడు పరికరాల స్వాధీనం

మణిపూర్ : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మయన్మార్ సరిహద్దు సమీపంలో అధునాతన పేలుడు పరికరాలను సాయుధ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మణిపూర్ లో ఉగ్రవాదులు దాడి చేయడానికి అధునాతన పేలుడు పరికరాలను మయన్మార్ నుంచి భారతదేశంలోకి తీసుకువస్తుండగా సాయుధ బలగాలు పట్టుకున్నాయి. ఉగ్రవాదులు ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే ఉద్ధేశంతో పేలుడు పరికరాలను తెచ్చారని పోలీసులు చెప్పారు. ఇండో-మయన్మార్ సరిహద్దులోని మోరే వద్ద అస్సాం రైఫిల్స్ మోరే బెటాలియన్ మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది.ఈ పేలుడు పరికరాలను మయన్మార్ నుంచి బైక్‌పై తరలిస్తుండగా సరిహద్దు వెంబడి ఉన్న బెతుక్ గ్రామ సమీపంలో అస్సాం రైఫిల్స్ దళం పట్టుకుంది.


అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మణిపూర్ లో రికార్డు స్థాయిలో దాడులు నిర్వహించి రూ.160 కోట్ల విలువైన అక్రమ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.180 ఫ్లయింగ్ స్క్వాడ్ లను మోహరించామని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజేష్ అగర్వాల్ చెప్పారు. మణిపూర్ లో ఎన్నికల సందర్భంగా తిరుగుబాటు గ్రూపులు, డ్రగ్స్, ఆల్కహాల్ ముఠాలు, ఉగ్రవాదుల హింస వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 653 ఫిర్యాదులు వచ్చాయని, 45 కేసులు నమోదు చేశామని ఎన్నికల అధికారి చెప్పారు. 


Updated Date - 2022-02-24T12:48:59+05:30 IST