ముళ్ల పొదల్లో మహనీయుల విగ్రహాలు

ABN , First Publish Date - 2022-08-14T05:18:20+05:30 IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్య్రం వ చ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా గత వారం రోజుల నుంచీ ఆజాదీకా అమృత్‌ మహోత్సవం పేరిట గ్రామాలలో వేడుకలు నిర్వహిస్తున్నారు.

ముళ్ల పొదల్లో  మహనీయుల విగ్రహాలు
కొమ్మినేనివారిపాలెంలో గ్రామ సచివాలయం ఎదరుగా ముళ్ల పొదల్లో పడిఉన్న మహనీయుల విగ్రహాలు

పట్టించుకోని అధికారులు

బల్లికురవ, ఆగస్టు 13: కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్య్రం వ చ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా గత వారం రోజుల నుంచీ ఆజాదీకా అమృత్‌ మహోత్సవం పేరిట గ్రామాలలో వేడుకలు నిర్వహిస్తున్నారు. బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామంలో మాత్రం గ్రామ సచివాలయం ఎదుటే స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహ నీయుల విగ్రహాలు ముళ్ల పొదల్లో పడిఉన్నా ఎవరు వాటి గురించి పట్టించుకొన్న దాఖలాలు కనిపించటం లేదు. ఎంతో ఆర్బాటంగా పం చాయతీ అధికారులు, ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు వి ద్యార్థులతో గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు కాని మ హనీయుల విగ్రహాలు మరుగున పడి ఉన్నాయని మాత్రం గుర్తించ లేదు. సాక్షాత్తు గ్రామ సచివాలయం ఎదుటే ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నా, అక్కడ పనిచేసే అధికారులు మాత్రం వాటితో తమకు సంబంధం లేదన్నట్లు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. కొమ్మినేనివారిపాలెం గ్రామ ప్రధాన వీధిలో రెండు దశాబ్దాల క్రితం గతంలో ఉన్న గ్రామ పెద్దలు జాతిపిత మహత్మ గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారు.


భవనం నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని..

అయితే, ఎనిమిదేళ్ల క్రితం గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి మహనీయుల విగ్రహాలు అడ్డుగా ఉన్నాయని తొలగించారు. తదుపరి మరలా ఏర్పాటుచేద్దామని  పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. అప్పటినుంచి ఈ విగ్రహాల గురించి ఎవరూ పట్టించుకొన్న  దాఖలాలు లేవు. ఖాళీ స్థలం కావటంతో కొందరు ఈ విగ్రహలు ఉన్న చోట పశువుల పరీక్షలు నిర్వహించటంతో పాటు మూత్ర విసర్జన కూడా చేస్తున్నారు. మహనీయుల సేవలను గుర్తిం చాల్సిన వారే ఇలా పట్టీపట్టనట్లుగా ఉండటం పట్ల విమర్శలు వినిపి స్తున్నాయి. గ్రామంలో ఎందరో విద్య వంతులు ఉన్నా వీటిని మరలా ఏర్పాటుచేసేందుకు ముందుకు రావటం లేదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగానైనా కొమ్మినేనివారిపాలెంలో ముళ్ల పొదల్లో పడిఉన్న మహ నీయుల విగ్రహాలను గ్రామ ప్రజలు, అఽధికారులు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Updated Date - 2022-08-14T05:18:20+05:30 IST