‘ఎరుకల వారికి గుర్తింపు కార్డులివ్వాలి’

ABN , First Publish Date - 2022-07-04T05:21:10+05:30 IST

వెదురు బుట్టలు అల్లుకుని జీవించే మైదాన ప్రాంత ఆదివాసి ఎరుకల వర్గీయులకు అడవి నుంచి వెదురు కొయ్యలు తెచ్చుకునేందుకు వీలుగా ప్రభు త్వం, జిల్లా అధికారులు గుర్తింపు కార్డులివ్వాలని ఆలిండియా ఎరుకల హ క్కుల పోరాట సమితి (ఎఐవైహెచ్‌ౄపిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షం శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

‘ఎరుకల వారికి గుర్తింపు కార్డులివ్వాలి’

కడప (మారుతీనగర్‌), జూలై 3: వెదురు బుట్టలు అల్లుకుని జీవించే మైదాన ప్రాంత ఆదివాసి ఎరుకల వర్గీయులకు అడవి నుంచి వెదురు కొయ్యలు తెచ్చుకునేందుకు వీలుగా ప్రభు త్వం, జిల్లా అధికారులు గుర్తింపు కార్డులివ్వాలని ఆలిండియా ఎరుకల హ క్కుల పోరాట సమితి (ఎఐవైహెచ్‌ౄపిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షం శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక యర్రముక్కపల్లెలోని సమితి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పందుల పెంపకానికి అనువైన షెడ్లను ఏర్పాటుచేసి ఇవ్వాలన్నారు. అనం తరం జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది వైహెచ్‌పిఎస్‌ జిల్లా నూతన అధ్యక్షుడిగా పెనుగొండ పుల్లయ్య, గౌరవాధ్యక్షులుగా జె. సుబ్బరాయుడు, కోశాధికారిగా టి. వెంకటేష్‌, నగర అధ్యక్షుడిగా ఎస్‌ఎస్‌ వెంకటసుబ్బయ్య, పి.గంగయ్య, మహిళా అధ్యక్షురాలుగా కె.వరలక్ష్మి, ప్రధానకార్యదర్శిగా కె.రామలక్షుమ్మ, ఉపాధ్యక్షురాలుగా జె.వాణి, పి. కాంతమ్మ, తదితరులను ఎన్నికచేశారు. 

Updated Date - 2022-07-04T05:21:10+05:30 IST