దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే

ABN , First Publish Date - 2020-10-31T06:47:59+05:30 IST

‘దేశంలో ఎక్కడ లేని పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు.. సీఎం కేసీఆర్‌ 200 పింఛన్‌ను మొదట వెయ్యి చేసిండు.. రెండో దఫా గెలిస్తే రెండు వేలు చేస్తానని, రూ.2016 ఇస్తున్నరు. ఇది కూడా తామే ఇస్తున్నామని బీజేపోళ్లు

దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే

బీజేపీది నరంలేని నాలుక

దుబ్బాక చైతన్యం గల గడ్డ

నా చెయ్యిపట్టుకుని అడిగే స్వతంత్య్రం మీకుంది

ధర్మాజిపేట ధూందాంలో మంత్రి హరీశ్‌రావు


దుబ్బాక, అక్టోబరు 30 : ‘దేశంలో ఎక్కడ లేని పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు.. సీఎం కేసీఆర్‌ 200 పింఛన్‌ను మొదట వెయ్యి చేసిండు.. రెండో దఫా గెలిస్తే రెండు వేలు చేస్తానని, రూ.2016 ఇస్తున్నరు. ఇది కూడా తామే ఇస్తున్నామని బీజేపోళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నరు. బీజేపోళ్లదని నరం లేని నాలుక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో సాంస్కృతిక కళాసారథి రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో ధూందాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తాను దుబ్బాక బస్టాండ్‌కు చర్చకు రావాలని బీజేపీ వాళ్లకు సవాల్‌ విసిరితే  ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తేలు కుట్టిన దొంగాలే మెసలారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ తన సొంత సీటును గెలిపించుకోలేదు కానీ దుబ్బాకకు వచ్చి గెలిపిస్తానంటూ ఊర్లు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసేందుకు హూజుర్‌నగర్‌ వెళ్లలేదని, కానీ కృతజ్ఞత సభకు వెళ్లి రూ.300 కోట్లను ప్రకటించారని గుర్తు చేశారు. దుబ్బాకను కూడా కానుకగా ఇచ్చి, సీఎంను పిలుచుకుందామని, అంతకంటే ఎక్కువ అభివృద్ధిని సాధించుకుందామని చెప్పారు.


ఆ సహాయం కావాలంటే టీఆర్‌ఎ్‌సతోనే అయితదిగానీ, బీజేపోళ్లు, కాంగ్రేసోళ్లు ఎక్కడి నుంచి చేస్తారని ప్రశ్నించారు. కాలు అడ్డంపెడితే నీళ్లు కావాలని, బీర్లు, బిర్యానీలు కాదని చెప్పారు. బీడుబారిన బతుకులు బాగుపడాలన్నారు. దుబ్బాకలో కాళేశ్వరం నీళ్లు ప్రతి గుంటకు రావాలంటే టీఆర్‌ఎస్‌ గెలువాలన్నారు. గెలుస్తుందనే నమ్మకం ఉందని.. కానీ ఈ కాలువలను, ప్రాజెక్టులను అడ్డుకున్న వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దుబ్బాకలోని ప్రతి పొలానికి నీళ్లు అందే పని ఇంకా ముందుందని తెలిపారు. ప్రాజెక్టు నీళ్లు ఎడాది లోపు వస్తాయని చెప్పారు. తాము లేకుంటే తెలంగాణ వచ్చేదా అని బీజేపీ నాయకులు అంటున్నారని, కేసీఆర్‌ లేకుంటే వచ్చేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ చావు నోట్లోకు వెళ్లి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ రావడం మూలంగానే రూ.2 వేల పింఛన్‌, కేసీఆర్‌ కిట్టు తెచ్చుకున్నామని గుర్తుచేశారు. రైతులకు ఉచిత కరెంటు సాధించుకున్నామని వివరించారు. బీడీల పింఛన్‌లో 1600 తమవే అని బీజేపీ నాయకులు ఝూటా మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు చెప్పిన సమయానికి వస్తా, దుబ్బాక బస్టాండ్‌కు వస్తా.. 1600 కేంద్రం ఇస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరితే సమాధానం లేదని, నోట్లో మాట కూడా రావడంలేదని దుయ్యబట్టారు.  ఈ ఝూటా పార్టీ బీజేపీని పట్టుకుని పోతే కుక్కతోకను పట్టుకుని గోదారి ఈదినట్టు ఉంటదని విమర్శించారు. గొల్లకుర్మలకు గొర్రెల్లో రూ.50 వేలు తమవేనని ప్రచారం చేసుకుంటున్నారని, అందులోనూ నయాపైసా కేంద్రానిది లేదని చెప్పారు.


వీటన్నీంటినీ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ప్రజలు బీజేపీ చెప్పిన మాటలు వినడానికి గొర్రెలు కాదని నిరూపించాలనీ, దుబ్బాక గడ్డ చైతన్యం గల గడ్డయని మరోసారి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. దుబ్బాకలో ఇచ్చిన తీర్పుతో కేంద్రం పూసలు కదలాలని, కాంగ్రె్‌సకు పత్తాలేకుండా పోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్మాజిపేటలో ధూందాం కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్నంత సేపు ప్రజల నుంచి హర్షాతీరేకాలు వ్యక్తమయ్యాయి. మహిళలు మంగళహారతులతో మంత్రికి స్వాగతం పలికారు. రసమయి బాలకిషన్‌, తేలు విజయ, ముక్కపల్లి శ్రీనివాస్‌ పాటలు అందరిని అలరించాయి.


మంచి చెడుకు నేను తోడుంటా

దుబ్బాక మున్సిపాలీటీలోని లచ్చపేటలో రూ.25 వేల కిరాయికి ఉంటున్నారని, ఎన్నికల తరువాత వీళ్ల ముఖం కనిపిస్తాదా అని ప్రశ్నించారు. మంచి చెడుకు తానే ఉంటానని, తనతోనే దుబ్బాక అభివృద్ధి సాధిస్తుందన్నారు. తన మీద మీకున్న స్వతంత్రం మరేవరికి ఉంటదని ప్రశ్నించారు. ఏ అభివృద్ధి అయినా తన చేయి పట్టుకుని సాధించుకునే స్వతంత్య్రం మీకుంటుందని స్పష్టం చేశారు. తోబుట్టువుగా సుజాతమ్మకు అండగా నిలబడుతాననీ, రాబోయే మూడేళ్లు దుబ్బాక అభివృద్ధిలో భాగమవుతానని తెలిపారు. ఎవరమన్నా.. దాపరికం లేదని, దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనని అన్నారు. దుబ్బాకను గెలిపించుకున్నాకా, అనేక పనులు చేసుకోవాలని, రాష్ట్రంలో ఎక్కడలేని అభివృద్ధి దుబ్బాక ప్రజలు చూస్తారని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-10-31T06:47:59+05:30 IST