కాంట్రాక్టర్ మృతితో నాకు సంబంధం లేదు: కర్ణాటక మంత్రి

ABN , First Publish Date - 2022-04-12T21:42:18+05:30 IST

బెళగవికి చెందిన సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఉడిపిలోని హోటల్ గదిలో మరణించడానికి..

కాంట్రాక్టర్ మృతితో నాకు సంబంధం లేదు: కర్ణాటక మంత్రి

బెంగళూరు: బెళగవికి చెందిన సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఉడిపిలోని హోటల్  గదిలో మరణించడానికి తానెంత మాత్రం బాధ్యుడని కాదని కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి కె.ఆశ్వరప్ప అన్నారు. మంత్రి తనను 40 శాతం కమిషన్ అడిగారంటూ అంతకుముందు సంతోష్ పాటిల్ ఆరోపించడం సంచలమైంది. దీంతో ఈశ్వరప్ప రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తన మృతికి ఈశ్వరప్పే కారణమంటూ పాటిల్ ఒక వాట్సాప్ మెసేజ్‌లో పేర్కొన్నట్టు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు.




''నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు. సంతోష్ పాటిల్‌ ఆరోపణలపై పరువునష్టం కేసు కూడా వేశాను. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తోందో చూద్దాం. మొత్తం వ్యవహారంలో నా తప్పిదం ఎక్కడా లేదని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను'' అని ఈశ్వరప్ప మీడియా సమావేశంలో తెలిపారు. సంతోష్ ఆరోపణలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కర్ణాటకలోని ఆర్‌డీపీఆర్‌కు లేఖ రాసిందని, అందుకు అనుగుణంగా జవాబు కూడా ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. సంతోష్ పాటిల్‌పై వేసిన పరువునష్టం కేసు కింద ఆయనకు నోటీసు కూడా వెళ్లిందని, ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని అన్నారు. అంతకుముందు తనకు ఏమీ తెలియదని చెప్పారు. 

Updated Date - 2022-04-12T21:42:18+05:30 IST