నగరంలో విస్తృతంగా హైపో క్లోరైడ్‌ పిచికారీ

ABN , First Publish Date - 2021-05-13T05:17:52+05:30 IST

కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా కొనసాగుతుండడంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నగరమంతటా సోడియం హైపో క్లోరైడ్‌ స్ర్పేయింగ్‌ చేయిస్తున్నారు

నగరంలో విస్తృతంగా హైపో క్లోరైడ్‌ పిచికారీ
రోడ్లపై స్ర్పేయింగ్‌ను పర్యవేక్షిస్తున్న మేయర్‌, ప్రధాన వైద్యాధికారి

విశాఖపట్నం, మే 12(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా కొనసాగుతుండడంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నగరమంతటా సోడియం హైపో క్లోరైడ్‌ స్ర్పేయింగ్‌ చేయిస్తున్నారు. మలేరియా విభాగం ఆధ్వర్యంలో ప్రతీరోజూ 800 లీటర్ల హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల ఇల్లు, కార్యాలయాలు, వీధులు, ప్రధాన రోడ్లు, మార్కెట్లు, శ్మశానాల వద్ద స్ర్పేయింగ్‌ చేస్తున్నారు. అందుకోసం రెండు భారీ బెల్మ్‌ వాహనాలు, జోన్‌కి ఒకటి చొప్పున టాటాఏస్‌ వాహనాలతో స్ర్పేయింగ్‌ చేస్తున్నారు. వార్డుకి ఒకరు చొప్పున సిబ్బందిని కేటాయించి పంప్‌తో స్ర్పేయింగ్‌ చేయిస్తున్నట్టు అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు తెలిపారు. వీరుకాకుండా పారిశుధ్య విభాగం నుంచి వార్డుకి ఐదుగురు చొప్పున సిబ్బంది నిత్యం తమకు కేటాయించిన బ్లీచింగ్‌ ను నీటిలో కలిపి స్ర్పేయింగ్‌ చేస్తున్నట్టు ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ శాస్త్రి తెలిపారు. 

Updated Date - 2021-05-13T05:17:52+05:30 IST