HYD : గ్రేటర్ వ్యాప్తంగా చల్లటి వాతావరణం.. 5 డిగ్రీలు తక్కువ

ABN , First Publish Date - 2021-11-23T11:47:44+05:30 IST

గ్రేటర్‌ వ్యాప్తంగా నాలుగు రోజులుగా చల్లటి వాతావరణం ...

HYD : గ్రేటర్ వ్యాప్తంగా చల్లటి వాతావరణం.. 5 డిగ్రీలు తక్కువ

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ వ్యాప్తంగా నాలుగు రోజులుగా చల్లటి వాతావరణం ఏర్పడడంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ చలిగాలులు వీచాయి. కొద్ది రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మరో రెండు, మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-11-23T11:47:44+05:30 IST