హైదరాబాద్: నిలోఫర్‌లో కిడ్నాప్ అయిన చిన్నారి క్షేమం...

ABN , First Publish Date - 2022-03-02T19:29:01+05:30 IST

హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాప్ అయిన 18 నెలల చిన్నారి ఆచూకి దొరికొంది.

హైదరాబాద్: నిలోఫర్‌లో కిడ్నాప్ అయిన చిన్నారి క్షేమం...

హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాప్ అయిన 18 నెలల చిన్నారి ఆచూకి దొరికొంది. ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీ పూటేజి ద్వారా అనుమానిత మహిళను పోలీసులు గుర్తించారు. అత్తాపూర్ కల్లు కాంపౌండ్ దగ్గర చిన్నారిని కాపాడారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ అయిన నాలుగు గంటల్లోనే ఈ కేసును పోలీసులు చేధించారు. సీసీటీవీ పూటేజి ఆధారంగా చిన్నారి ఆచూకి లభించినట్లు తెలిపారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు ప్రకటించారు. 


బుధవారం ఉదయం నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అనుమానిత మహిళను గుర్తించారు. పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి.. నాలుగు గంటల్లోనే చేధించారు.

Updated Date - 2022-03-02T19:29:01+05:30 IST