నేటి నుంచి తెలంగాణలో వ్యాక్సిన్ సెంటర్లు పెంపు

ABN , First Publish Date - 2021-01-18T13:09:50+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను పెంచనున్నారు.

నేటి నుంచి తెలంగాణలో వ్యాక్సిన్ సెంటర్లు పెంపు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను పెంచనున్నారు. టీకాపై భయం తొలగుతుండడంతో పాటు సాంకేతిక సమస్యలు కూడా క్రమంగా పరిష్కారమవుతుండటంతో టీకా కార్యక్రమంలో నేటీ నుంచి జోరందుకోనుంది. దాదాపు 500 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 30 నుంచి 100 మంది వరకు వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి రోజు 2,07,229 మందికి టీకా వేశారు! రెండో రోజు కేవలం ఆరు రాష్ట్రాల్లో 17,072 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడుల్లో టీకా కార్యక్రమం కొనసాగించారు. ఏపీలో తొలిరోజు 332 కేంద్రాల్లో 19,025 మందికి టీకాలు వేసిన ప్రభుత్వం రెండోరోజైన ఆదివారం 308 కేంద్రాల్లో 13,041 మందికి వ్యాక్సిన్‌ అందించింది.

Updated Date - 2021-01-18T13:09:50+05:30 IST