మావో కుటుంబాల ఇళ్లకు వెళ్లిన రాచకొండ పోలీసులు

ABN , First Publish Date - 2021-06-27T17:50:47+05:30 IST

మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు రక్షణ దళంగా ఉన్న చంద్రన్న, పల్లెపాటి రాధ మావోయిస్టు కుటుంబాల ఇళ్లకు వెళ్లిన రాచకొండ పోలీసులు వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

మావో కుటుంబాల ఇళ్లకు వెళ్లిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు రక్షణ దళంగా ఉన్న చంద్రన్న, పల్లెపాటి రాధ మావోయిస్టు కుటుంబాల ఇళ్లకు వెళ్లిన రాచకొండ పోలీసులు వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీపీఐ మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉన్న అల్వాల్ చంద్రహాస్ అలియాస్ చంద్రన్న, పల్లెపాటి రాధల ఇంటి కుటుంబసభ్యుల బాగోగులను డీసీపీ రక్షిత జవహర్ తెలుసుకున్నారు. నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మావోయిస్టు చంద్రన్న, కాప్రాలోని పల్లెపాటి రాధ కుటుంబసభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చంద్రన్న సోదరి పార్వతి ఆరోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి డీసీపీ రక్షిత తెలుసుకున్నారు. పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో తండ్రి పల్లెపాటి బాలయ్య, తల్లి పల్లెపాటి పోచమ్మలకు ఇంటి సరుకులను డీసీపీ, ఏసీపీ బృందం అందజేసింది. ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయేలా సహకరించాలని పోలీస్‌ బృందం కోరింది.  హింస ద్వారా సాధించేది ఏమి లేదని, అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి వస్తే.. ఆరోగ్యంతో పాటు అన్ని రకాలుగా సహకరిస్తామని కుటుంబ సభ్యులకు డీసీపీ రక్షిత, ఏసీపీ శివకుమార్, జవహర్ నగర్ సీఐ భిక్షపతి హామీ ఇచ్చారు.

Updated Date - 2021-06-27T17:50:47+05:30 IST