బాచుపల్లిలో అక్రమ మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-06-18T17:20:50+05:30 IST

నగరంలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి బాచుపల్లి గ్రామ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

బాచుపల్లిలో అక్రమ మద్యం పట్టివేత

హైదరాబాద్: నగరంలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి బాచుపల్లి గ్రామ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బాచుపల్లి నుండి విజయవాడకు డిసిఎం వాహనంలో మద్యం తరలిస్తుండగా మార్గంలోని ఐడిపిఎల్ హౌసింగ్ కాలనీ వద్ద పక్కా సమాచారంతో డీసీఎంను మాధాపూర్ ఎస్వోటి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు పోలీసులను అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. డిసిఎమ్, మందు బాటిల్స్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.3 లక్షలు ఉండవచ్చని అంచనా. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-06-18T17:20:50+05:30 IST