ఘన్ముక్లలో కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న ఈటల అనుచరులు

ABN , First Publish Date - 2021-10-30T15:47:07+05:30 IST

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గణుముక్కుల గ్రామంలో పోలింగ్ బూత్ లోపల టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది.

ఘన్ముక్లలో కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న ఈటల అనుచరులు

హుజురాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో పోలింగ్ బూత్ లోపల టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఘన్ముక్లలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా తనకు ఏజెంట్ పాస్ ఉందని కౌశిక్ రెడ్డి చెప్పగా... స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Updated Date - 2021-10-30T15:47:07+05:30 IST