కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, విపక్షాల మద్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హుజురాబాద్ బై పోల్ హీటెక్కింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఆ పార్టీల అధ్యక్షుల్ని బరిలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కానీ గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ప్రచారంపై ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యమంత్రి ప్రచారం ఎప్పుడంటూ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి.