Abn logo
Aug 4 2021 @ 14:06PM

హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట.. గంగుల కమలాకర్‌కు ఈడీ షాక్

కరీంనగర్: జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణపై ఈడీ కొరడా ఝులిపించింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట మంత్రి గంగుల కమలాకర్‌‌కు ఊహించని షాక్ తగిలింది. మంత్రికి సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులిచ్చింది. గంగులకు చెందిన శ్వేత ఏజెన్సీతో పాటు మరో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులిచ్చింది. ఈడీ నోటీసులపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో ఫెమా నిబంధనలు ఉల్లంగించారని ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈడీకి న్యాయవాదులు బేతి మహేందర్‌రెడ్డి, గంగాధర్‌ ఫిర్యాదు చేశారు. తక్కువ పరిణామం చూపి.. ఎక్కువ మోతాదులో గ్రానైట్ ఎగుమతి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విదేశాలకు ఏ మేరకు ఎగుమతి చేశారో చెప్పాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇక్కడి కంపెనీలు గనులశాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కవ గ్రానైట్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.


విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖ పోర్టులకు వెళ్లి అధికారులు పరిశీలన చేసినట్లు చెబుతున్నారు. అయితే విదేశాలకు ఎగుమతి చేస్తున్న గ్రానైట్‌కు భారీ తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మే 29న ఉన్నతాధికారులకు ఓ నివేదిన ఇచ్చినట్లు సమాచారం. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై ఈడీతో పాటు సీబీఐకి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. నేడో రేపో సీబీఐ రంగంలోకి దిగే అవకాలునట్లు తెలుస్తోంది.