భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

ABN , First Publish Date - 2022-01-20T05:19:56+05:30 IST

అవును వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 12 సంవత్సరాలుగా కలిసి కాపురం చేస్తున్నారు. వారికి ఒక మగ బిడ్డ జన్మించాడు.

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
దేశాయిపేట్‌లో భర్త శివకృష్ణ ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న భార్య స్వాతి

12 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త శివకృష్ణ

బాబు పుట్టిన తర్వాత ఇష్టం లేదంటూ భార్యను వదిలివేసిన భర్త

దళిత అమ్మాయిని అత్తింటి వారు రానివ్వని వైనం

మద్దతుగా దళిత సంఘాలు, సీఐటీయూ, విద్యార్థి సంఘాల ఆందోళన

బాన్సువాడ, జనవరి 19: అవును వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 12 సంవత్సరాలుగా కలిసి కాపురం చేస్తున్నారు. వారికి ఒక మగ బిడ్డ జన్మించాడు. కాపురంలో ఎటువంటి సమస్యలు లేకుండా సాగిపోతుండడంతో అంతలోనే నువ్వు నాకు అవసరం లేదని మూడేళ్ల కిందటే ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన భర్త ఉదంతమిది. దీంతో భార్య బిడ్డతో భర్త ఇంటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని దేశాయిపేటలో చోటు చేసుకుంది.  వివరాలు.. 2012 సంవత్సరంలో బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ ఎన్‌కే డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువు తున్న సమయంలో బాన్సువాడ మండలం నాగా రం గ్రామానికి చెందిన  స్వాతి, దేశాయిపేట్‌ గ్రామానికి చెందిన శివకృష్ణలు ఇద్దరు ప్రేమించు కున్నారు. ప్రేమ కాస్త పెండ్లి దాక వెళ్లింది. చివరకు కుటుంబ సభ్యులకు తెలియకుండానే నిజామాబా ద్‌లోని ఆర్యసమాజ్‌లో 2019లో వివాహం చేసుకు న్నారు. అప్పటి నుంచి హైదరాబాద్‌కు ఇద్దరు వెళ్లి పోయారు. వీరు ఒక పండంటి మగ బిడ్డకు జన్మనించారు. భార్య స్వాతి ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పు డు ఆరోగ్యం బాగోలేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి భర్త శివకృష్ణ తీసుకువచ్చాడు. ఆసుపత్రి ఖర్చుల కోసం ఆమె మీద ఉన్న బంగారాన్ని అమ్మి తీసుకొస్తానని వెళ్లిన భర్త ఎంతకీ రాకపోవడంతో తల్లికి ఫోన్‌ చేయగా ఆమె వచ్చి వైద్యులను సం ప్రదించగా పరిస్థితి సీరియస్‌గా ఉంది ఆపరేషన్‌ చేయకుంటే తల్లికే ప్రమాదం ఉందని చెప్పడంతో ఏడు నెలలకే డెలివరీ చేసి నాగారం గ్రామానికి తీసుకువచ్చింది. ఇప్పు డు బాబుకి మూడు సంవత్సరాలు. మూడేళ్లుగా శివకృష్ణకు ఫోన్‌ చేస్తూ తనను మీ ఇంటికి తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డా తీసుకెళ్లలేదని స్వాతి కన్నీటి పర్యంతమయ్యింది. శివకృష్ణ మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. శివకృష్ణ కుటుంబ సభ్యులు దళిత మహిళను విడిచి పెట్టాలని, వేరే అమ్మాయితో వివాహం చేయిస్తామని ఫోన్‌ లో శివకృష్ణతో మాట్లాడినప్పుడు స్వాతి విన్నట్లు తెలిపింది. తనకు భర్త శివకృష్ణ కావాలని, తన భర్త వచ్చేంత వరకు న్యాయ పోరాటం చేస్తానని ఆమె తెలిపారు. ఆమెకు మద్దతుగా దళిత సంఘాల నాయ కులు, సీఐటీయూ విద్యార్థి సంఘాల నాయకులు బాసటగా నిలిచి ఆందోళ నకు దిగారు. 

Updated Date - 2022-01-20T05:19:56+05:30 IST