Abn logo
Apr 13 2021 @ 12:50PM

మద్యానికి బానిసైన భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే..


బెంగళూరు: భర్తలు ఆవేశానికి లోనై భార్యలపై దాడులు చేయడం, హతమార్చడం తరచూ జరుగుతుంటాయి. బెంగళూరు జగజ్జీవన్‌రామ్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మద్యానికి బానిసగా మారి తరచూ వేధిస్తున్న భర్తను ఏకంగా భార్య గొంతుపై కాలు పెట్టి హతమార్చిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బీబీఎంపీ చెత్త రవాణా చేసే ఆటో డ్రైవర్‌ మోహన్‌ (41) హత్యకు గురైనవారు. భార్య పద్మా(36) హత్యకు కారకులుగా భావించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణలు జరుపుతున్నారు. బీబీఎంపీలోనే కాంట్రాక్టు పద్దతిన పద్మా పౌర కార్మికురాలిగా పనిచేస్తున్నారు. 16 ఏళ్ళ కిందట మోహన్‌, పద్మాలకు వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మోహన్‌కు మద్యం సేవించే అలవాటు ఉండేది. ఇదే కారణంతో ఇరువురి మధ్య గొడవలు జరిగే వి. ఆరునెలల కిందట రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపా రు. కొంతకాలం మద్యానికి దూరంగా ఉన్న మోహన్‌ మరోసారి తాగుడుకు అలవాటు పడ్డారు. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన మోహన్‌ మరోసారి మద్యం కోసం భార్యను డబ్బులు డిమాండ్‌ చేశారు. ఇలా గొడవ జరిగింది. తెల్లవారు జామున 3.15గంటల వేళ మరోసా రి భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమె తోయడంతో భర్త మోహన్‌ కిందపడ్డారు. ఇదే సమయంలో గొంతుపై కాలుతో ఆమె తొక్కడంతో తీవ్ర అస్వస్థతకు గురికాగా స్థానికంగా ఉండే వారి బంధువులు హుటాహుటిన కెంపేగౌడ ఆసుపత్రికి తరలించారు. చికిత్సలు ఫలించక మోహన్‌ మృతి చెందారు. జగజ్జీవన్‌రామ్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్య పద్మాను అదుపులోకి తీసుకుని విచారణలు జరుపుతున్నారు. కాగా గొడవ జరిగినప్పుడు పిల్లలు ఇంట్లో లేనట్లు తెలిసింది. 


Advertisement
Advertisement
Advertisement