ఇద్దరు పోలీసులపై వేటు

ABN , First Publish Date - 2021-06-13T05:04:45+05:30 IST

హత్య కేసులో అనుమానితునికి పోలీస్‌స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన కేసులో ఇద్దరు పోలీసులపై వేటుపడింది. ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ సాయన్న, కానిస్టేబుల్‌ రాజేశ్వర్‌లను స స్పెండ్‌ చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కమ్మర్‌పల్లి మండలం హసాకొత్తూర్‌ గ్రామంలో సిద్దార్థ్‌ అనే యువకుడు హత్యకు గు రికాగా, అందులో అను మానితుగా ఉన్న కనక రాజేష్‌ను పోలీసులు అ దుపులోకి తీసుకొని ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అనుమానితునికి స్టేషన్‌లో రాచమర్యాదలు చేశారు.

ఇద్దరు పోలీసులపై వేటు

ఆర్మూర్‌, జూన్‌12: హత్య కేసులో అనుమానితునికి పోలీస్‌స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన కేసులో ఇద్దరు పోలీసులపై వేటుపడింది. ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ సాయన్న, కానిస్టేబుల్‌ రాజేశ్వర్‌లను స స్పెండ్‌ చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కమ్మర్‌పల్లి మండలం హసాకొత్తూర్‌ గ్రామంలో సిద్దార్థ్‌ అనే యువకుడు హత్యకు గు రికాగా, అందులో అను మానితుగా ఉన్న కనక రాజేష్‌ను పోలీసులు అ దుపులోకి తీసుకొని ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అనుమానితునికి స్టేషన్‌లో రాచమర్యాదలు చేశారు. అనుమానితుడిని ఒక గదిలో ఉంచ కుండా స్టేషన్‌లో ఫ్రీగా ఉంచారు. ఫోన్‌ మాట్లాడడానికి మిత్రులు కలుసు కునేందుకు అవకాశం ఇచ్చారు. పక్కన మిత్రులను నిలుచోబెట్టి రెండు టె బుల్‌ మీద కూర్చొని తినే ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు వాహనం ధ్వంసం చేశారు. పోలీసులను గ్రామం నుంచి బయటకు పంపారు. పోలీసుల వైఖరిని ఎండగడుతూ ‘ఆంధ్రజ్యోతి’లో గత నెల 22వ తేదీన ‘హత్య కేసు లో నిందితుడికి పోలీస్‌స్టేషన్‌లో రాచమర్యాదలు’ శీర్షికన కథనం ప్రచురిం చింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
కిందిస్థాయి సిబ్బంది బలి..
రాచమర్యాదల కేసులో పైస్థాయి అధికారులపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బందినే బలి చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోల ఆదే శాలు లేకుండా అనుమానితులకు సేవలు అందవు. ఎవరిని కలువనివ్వ రు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కిందిస్థాయి సిబ్బంది పని చేశారు. కానీ, పైస్థాయి అధికారులపై తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బందిపై చర్య లు తీసుకోవడం చర్చనీయాంశమైంది.  

Updated Date - 2021-06-13T05:04:45+05:30 IST